amp pages | Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు

Published on Sat, 07/08/2017 - 09:31

ముంబై : ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకున్న డిమాండ్‌ అంతాఇంతా కాదు. ఇక అబ్బాయి తల్లిదండ్రులైతే, తమ కొడుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ పిలిచి మరీ పిల్లను ఇస్తారంటూ తెగ భరోసాతో ఉండేవారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా తమ అల్లుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయితే బాగుండును అనుకుంటూ జల్లెడ వేసి మరీ సాఫ్ట్‌వేర్‌లను వెతికి పట్టుకుని తమ కూతురికిచ్చి కట్టబెట్టేవారు. అయితే తాజాగా ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న లేఆఫ్స్‌ బెడద, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు తెచ్చిపెడుతోంది. మ్యారేజ్‌ మార్కెట్లో వారికి ఉన్న పాపులారిటీ అంతకంతకు పడిపోతుందని మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ ట్రెండ్‌లు వెల్లడిస్తున్నాయి.
 
ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న భారీగా ఉద్యోగాల కోత, ఆటోమేషన్‌ ప్రభావం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పదవిలోకి వచ్చిన తర్వాత కల్లలవుతున్న డాలర్‌ కలలు వీరి డిమాండ్‌కు గండికొడుతున్నాయి. ముఖ్యంగా అరేంజ్‌ మ్యారేజ్‌ల విషయంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందట. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అంటే కూతురి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌నే అల్లుడిగా కోరుకునేవారు, ఇప్పుడు ఉద్యోగంఎప్పుడు  ఊడుతుందో తెలియని వారికి పిల్లను ఎలా ఇచ్చేది అంటూ వెనుకకు జంకుతున్నారని మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. ఇటీవల ఐఏఎస్‌, ఐపీఎస్‌, డాక్టర్‌, బిజినెస్‌ అల్లుళ్ల కోసం అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కువగా కాల్‌ చేస్తున్నారని తెలిసింది.
 
2017 ప్రారంభం నుంచి ఐటీ ప్రొఫిషనల్స్‌ ను అమ్మాయిలు తక్కువగా కోరుకుంటున్నారని షాదీ.కామ్‌ సీఈవో గౌరవ్‌ రక్షిత్‌ తెలిపారు. భారత్‌లో అతిపెద్ద మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో షాదీ.కామ్‌ కూడా ఒకటి. ఇక అమెరికాలో సెటిలైన జీవిత భాగస్వాములను కూడా అమ్మాయిలు తక్కువగా చూస్తున్నారని చెప్పారు. ఈ ట్రెండ్‌ నవంబర్‌ నుంచి కొనసాగుతుందన్నారు. ఈ తగ్గింపు నవంబర్‌లో 11 శాతముంటే, ఫిబ్రవరికి వచ్చే సరికి ఇదీ మరింత తగ్గి 15 శాతానికి చేరుకుందని గౌరవ్‌ తెలిపారు. ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలతో చాలామంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేసే వారు స్వదేశ బాటపడుతున్నారు. షాదీ.కామ్‌లోనే కా​క​, జీవన్‌సాథి.కామ్‌లో కూడా ఇదే ట్రెండ్‌. దీంతో ఐటీ ప్రొఫిషనల్స్‌కు లేఆఫ్స్‌ ఇబ్బందులు మాత్రమేకాక, కొత్త కష్టాలు వస్తున్నట్టు తెలిసింది.   

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌