amp pages | Sakshi

రూ.11 వేలకే కొత్త సియాజ్‌ బుకింగ్‌

Published on Thu, 08/09/2018 - 15:05

న్యూఢిల్లీ : సరికొత్త హంగులతో మారుతీ సుజుకీ కొత్త సియాజ్‌ 2018 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ఈ నెల 20న విడుదల కానుంది. ఈ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ బుకింగ్స్‌ను కంపెనీ రేపటి నుంచి ప్రారంభించబోతుంది. ఎంఎస్‌ఐ నెక్సా నెట్‌వర్క్‌ నుంచే ఈ మోడల్‌ను విక్రయించబోతుంది. తొలుత 11 వేల రూపాయలను కట్టి ఈ కొత్త సియాజ్‌ను బుక్‌ చేసుకోవచ్చు. 319 నెక్సా షోరూంలలో దీని బుకింగ్స్‌ను చేపడుతున్నామని మారుతీ సుజుకీ ప్రకటించింది. నెక్సా వెబ్‌సైట్‌ నుంచి కూడా దీన్ని ఈ-బుక్‌ చేసుకోవచ్చు. ఈ వాహనం అనధికారిక బుకింగ్స్‌ను డీలర్లు రెండు వారాల కిందటే ప్రారంభించారు.

మారుతీ సియాజ్‌ భారత్‌లోకి లాంచ్‌ చేసి నాలుగేళ్లకు పైగా అవుతుంది. గత ఆరు నెలల నుంచి సియాజ్‌ విక్రయాలు పడిపోతూ ఉన్నాయి. ఈ అమ్మకాలను పెంచడానికి సరికొత్త హంగులతో కొత్త సియాజ్‌ను మారుతీ సుజుకీ ప్రవేశపెడుతోంది. ఈసారి సియాజ్‌ ఫ్రంట్‌ ఎండ్‌ లుక్స్‌, ఇంటీరియర్స్‌తో పాటు ఇంజిన్‌లోనూ మార్పులు చేశారు. హ్యుందాయ్‌ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్‌ వెంటో, స్కోడా ర్యాపిడ్‌, టయోటా యారిస్‌లకు ఇది పోటీగా నిలువొచ్చన్నది అంచనా.
 
ఇవీ హంగులు...

  • సియాజ్‌ ఫ్రంట్‌ లుక్స్‌ గతాని కన్నా షార్ప్‌గా ఉన్నాయి.
  • 5-స్పీడ్‌ మాన్యువల్‌, 4-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఉంది.
  • ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌తో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌
  • కొత్త ఎల్‌ఈడీ రియర్‌ కాంబినేషన్‌ టైల్‌ల్యాంప్స్‌
  • స్లీకర్‌ గ్రిల్‌, క్రోమ్‌ గార్నిషింగ్‌, అప్‌డేటెడ్‌ బంపర్‌, బ్రో షేప్‌ హెడ్‌లైట్స్‌తో కాస్త విభిన్నంగా కనిపిస్తుంది.
  • ఇంజిన్‌ పరంగా మార్పులు బాగానే చేశారు. సియాజ్‌ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. గతంలో ఇది 1.4 లీటర్‌ ఇంజిన్‌గా ఉండేది. నూతన ఇంజిన్‌ 103 బీహెచ్‌పీ శక్తిని, 138 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది.
  • వెనుక భాగంలో పెద్దగా మార్పులేవీ లేవు. అయితే ఇంటీరియర్స్‌లో కొత్తగా లైట్‌ కలర్డ్‌ ఫాక్స్‌ ఉడ్‌ ఇన్‌లేస్‌, టచ్‌ స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో వంటి హంగులద్దారు.
  • నెక్సా బ్లూ, మెటాలిక్‌ సిల్కీ సిల్వర్‌ కలర్స్‌తో పాటు మరికొన్ని వేరియంట్స్‌ ఉండవచ్చని అంచనా.
  • ధర రూ.7.8 లక్షల నుంచి ప్రారంభం

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)