amp pages | Sakshi

మెక్‌డొనాల్డ్స్‌ను తాకిన ‘మీటూ’ ఉద్యమం

Published on Tue, 05/22/2018 - 19:31

న్యూయార్క్‌ : అమెరికా ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌కూ ‘మీటూ’ ఉద్యమం తాకింది. మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా రెండు నేషనల్‌ అడ్వకసీ గ్రూప్‌లు లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశాయి. 9 నగరాల్లో ఈ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 10 మంది మహిళల తరుఫున ఈ గ్రూప్‌లు ఈ ఫిర్యాదు దాఖలు చేశాయి. ఈ వర్కర్లలో సెయింట్‌ లూయస్‌కు చెందిన ఓ 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. రెస్టారెంట్‌లో పనిచేసే సూపర్‌వైజర్లు తనను లైంగికంగా వేధిస్తున్నారని, అసభ్యకరంగా వ్యవహరిస్తూ.. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ అమ్మాయి ఆరోపించింది. ఆ ఒక్క అమ్మాయి మాత్రమే కాక ఫిర్యాదుల్లో తమ గోడును వెల్లబుచ్చుకున్న మహిళలందరూ తాము ఎంత లైంగిక వేధింపులకు గురి అవుతున్నామో వివరించారు. ఉద్యోగుల తక్కువ వేతనాలపై పోరాడుతున్న ఫైట్‌ ఫర్‌ 15 డాలర్స్‌ ఈ వివాదాన్ని నిర్వహిస్తోంది. ఈ కేసులకు అవసరమయ్యే లీగల్‌ కాస్ట్‌లను టైమ్స్‌ యూపీ లీగల్‌ డిఫెన్స్‌ ఫండ్‌ భరిస్తోంది. సొంతంగా ఈ కేసులను కమిషన్లు, కోర్టుల ముందుకు తీసుకురాలేని మహిళల కోసం నేషనల్‌ ఉమెన్స్‌ లా సెంటర్‌ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 

అమెరికా సమాన ఉద్యోగవకాశాల సంఘం వద్ద ఫైట్‌ ఫర్‌ 15 డాలర్స్‌ ఈ ఫిర్యాదులను దాఖలు చేసింది. ఈ లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మెక్‌డొనాల్డ్స్‌ అధికార ప్రతినిధి టెర్రి హిక్కీ స్పందించారు. తమ వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపులకు, వివక్షకు చోటు లేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుందని హిక్కీ చెప్పారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న రెస్టారెంట్‌ పేర్లలో ఫ్రాంచైజీలు నడిపేవే ఎక్కువగా ఉన్నాయని, వాటిని ప్రత్యక్షంగా మెక్‌డొనాల్డ్స్‌ నడపడం లేదని పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులను మెక్‌డొనాల్డ్స్‌ కార్పొరేషన్‌కు, ఫ్రాంచైజీలకు వ్యతిరేకంగా నమోదయ్యాయి. గత రెండేళ్ల క్రితం కూడా ఇదే రకమైన లైంగిక వేధింపుల ఆరోపణల ఫిర్యాదులను మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా ఫైట్‌ ఫర్‌ 15 డాలర్స్‌ నమోదు చేసింది. ఆ సమయంలో ఆరోపణలను సమీక్షించి, తగిన చర్యలు తీసుకుంటామని మెక్‌డొనాల్డ్స్‌ హామీ ఇచ్చింది. అయితే పాలసీల్లో ఏమైనా మార్పులు చేశారా అనే విషయంపై  స్పందించడానికి మాత్రం అధికార ప్రతినిధి నిరాకరించారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)