amp pages | Sakshi

భారత్‌కు ఆ అవకాశం ఉంది: అమెరికా

Published on Thu, 07/23/2020 - 10:55

వాషింగ్టన్‌: చైనాతో విభేదాలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నమ్మకం చూరగొన్న భారత్‌కు చైనా నుంచి తరలిపోతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించగల సత్తా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా వాణిజ్య అవసరాల కోసం భారత్‌ డ్రాగన్‌ కంపెనీలపై ఆధారపడటం తగ్గించుకోవాలని..  అప్పుడే చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ సృష్టిస్తున్న అవాంతరాలను సులభంగా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. (అగ్రదేశాల దౌత్య యుద్ధం)

ఈ మేరకు బుధవారం జరిగిన యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌(యూఎస్‌ఐబీసీ)- ‘‘ఇండియా ఐడియాస్‌ సమ్మిట్‌’’లో వర్చువల్‌ సమావేశంలో పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా- భారత్‌ కలిసి పనిచేస్తే ఎంతో బాగుంటుందని.. అయితే అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ మరింత సానుకూల వాతావరణం కల్పించాల్సి ఉంటుందన్నారు.(అమెరికా కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపు)

అదే విధంగా తాము కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాబోమని.. తమకు ఉన్న అతికొద్ది నమ్మకమైన, ఒకే ఆలోచనా విధానం కలిగిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి అంటూ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నామని.. జీ-7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా పాంపియో గుర్తు చేశారు.

ఇక చట్టాలకు లోబడి పనిచేసే సంస్థలు, పారదర్శకతకు అమెరికా పెద్ద పీట వేస్తుందన్న ఆయన.. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 చైనీస్‌ యాప్‌లను భారత్‌ నిషేధం విధించిన విషయాన్ని ప్రస్తావించారు. చైనాలోని వుహాన్‌ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా ఆర్థిక వ్యవస్థలు, ప్రైవేటు రంగం కుదేలైన విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రపంచ దేశాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కాగా భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)