amp pages | Sakshi

ఠారెత్తించిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Published on Sat, 09/22/2018 - 00:28

న్యూఢిల్లీ: హౌసింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌  కంపెనీ షేర్లు శుక్రవారం తీవ్రమైన నష్టాలకు గురయ్యాయి. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేర్‌ 42 శాతం కుదేలైంది. ఈ కంపెనీ లిక్విడిటీ సంక్షోభంలోకి కూరుకుపోతుందనే వదంతులు ప్రతికూల ప్రభావం చూపించాయి. మరోవైపు బాండ్ల రాబడులు పెరుగుతుండటంతో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు కూడా క్షీణించాయి. మరోపక్క, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో కూడా లిక్విడిటీ సమస్యలు ఉన్నట్లు వార్తలు రావడంతో ఈ రంగం షేర్లపై తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.

అసలేం జరిగింది.. ?  
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వాణిజ్య పత్రాలను డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ ఇటీవల విక్రయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌కు రూ. 350 కోట్ల మేర రుణాలిచ్చిన డీఎస్‌పీ మ్యూచువల్‌ఫండ్‌.. లిక్విడిటీని మెరుగుపరచుకోవడం కోసం రూ.200–300 కోట్ల విలువైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వాణిజ్య పత్రాలను 11 శాతం డిస్కౌంట్‌కు విక్రయించింది. దీంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్‌ భారీ కుదుపులకు గురైంది.

బుధవారం రూ.610 వద్ద ముగిసిన  ఈ షేర్‌ ఇంట్రాడేలో 60 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.246కు పతనమైంది. చివరకు  42 శాతం నష్టంతో రూ.352 వద్ద ముగిసింది. కేవలం గంటల వ్యవధిలోనే ఈ షేర్‌ ధర సగమైంది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఇంట్రాడేలో ఇంత అత్యధిక శాతం పతనమైన షేర్‌ ఇదే. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.8,120 కోట్లు ఆవిరై రూ.11,027 కోట్లకు పడిపోయింది. ఈ ప్రభావం ఇతర హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లపై తీవ్రంగానే పడింది.

ఇంట్రాడేలో పలు షేర్లు బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 8 శాతం, కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ 5.7 శాతం, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 5 శాతం, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌  5 శాతం మేర క్షీణించాయి. హౌసింగ్‌ ఫైనాన్స్‌కంపెనీల మాదిరే బ్యాంకేతర కంపెనీల షేర్లు కూడా కుదేలయ్యాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.5 శాతం, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 3.1 శాతం, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ 2.4 శాతం చొప్పున నష్టపోయాయి.

కంపెనీ వివరణ...
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ ఎలాంటి రుణ చెల్లింపుల్లో విఫలం కాలేదని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సీఎమ్‌డీ కపిల్‌ వాధ్వాన్‌ స్పష్టం చేశారు. బాండ్ల తిరిగి చెల్లింపుల్లో కానీ, ఇతర రుణాల చెల్లింపుల్లో కానీ ఎలాంటి జాప్యం లేదని వివరించారు. అంతే కాకుండా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీకి తాము ఎలాంటి రుణాలివ్వలేదని, ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొన్నారు.

ఒక్క డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరే కాకుండా ఈ సెగ్మెంట్‌లోని ఇతర కంపెనీల షేర్లు కూడా పడిపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ కంపెనీ ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నాయని, ఆరు నెలల నగదు నిల్వలకు సమానమైన రూ.10,000 కోట్ల నిధులు ప్రస్తుతం తమ వద్ద ఉన్నాయని వివరించారు. కంపెనీ ప్రమోటర్లు ఎవరూ తమ షేర్లను తనఖా పెట్టలేదని, కంపెనీ షేర్లు పెట్టి ఎవరూ రుణాలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.  

నిపుణులేమంటున్నారు...
నిధుల కటకట వదంతులతో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు భారీగా పతనమయ్యాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ అండ్‌ స్టాక్‌ నోట్‌ సీఈఓ జిమీత్‌ మోదీ వ్యాఖ్యానించారు. ఫండమెంటల్స్‌ పరంగా ఈ కంపెనీలు పటిష్టంగా ఉన్నప్పటికీ, మూక మనస్తత్వంతో మూకుమ్మడి అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే కనిష్ట స్థాయిల నుంచి ఈ షేర్లు కోలుకున్నాయని వివరించారు. 

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)