amp pages | Sakshi

గోల్డ్ డిపాజిట్‌లకు కొత్త స్కీమ్!

Published on Tue, 11/11/2014 - 00:56

న్యూఢిల్లీ: పసిడి డిపాజిట్ పథకాన్ని ఆధునీకరించి, పునఃప్రారంభించాలని గోల్డ్ అండ్ సిల్వర్ రిఫైనర్ ఎంఎంటీసీ పీఏఎంపీ సూచించింది. ప్రభుత్వరంగ ఎంఎంటీసీ- స్విట్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రపంచ ప్రముఖ గోల్డ్ రిఫైనర్ పీఏఎంపీ జాయింట్ వెంచర్ (జేవీ)గా ‘ఎంఎంటీసీ పీఏఎంపీ’ ఏర్పాటయ్యింది. ఏ విధంగా ప్రతిపాదిత పథకాన్ని పునఃప్రారంభించాలన్న అంశాన్ని కూడా జేవీ వివరించింది.

జేవీ ఎండీ రాజేష్ ఖోస్లా తెలిపిన ఈ వివరాల ప్రకారం...
     కనీసం 40 గ్రాములు డిపాజిట్ చేయగలిగిన విధంగా పథకాన్ని మార్చాలి.
     దేశ వ్యాప్తంగా బీరువాల్లో దాదాపు 25,000 టన్నుల పసిడి నిల్వలు నిక్షిప్తమయ్యాయి.
     ఇలాంటి పథకం ద్వారా మొత్తం నిల్వల్లో ఒక శాతం సమీకరించగలిగినా... కనీసం ఒక యేడాదిలో 250 టన్నుల పసిడి దిగుమతులను కట్టడికి చేయవచ్చు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి ఈ చర్య దోహదపడుతుంది.

 దేశ వ్యాప్తంగా 500 గృహాల సర్వే ప్రాతిపదికన తాజా ప్రతిపాదనను జేవీ చేసింది.
1999లో ప్రారంభించిన ప్రస్తుత గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం కనీస పసిడి డిపాజిట్ 500 గ్రాములు. ఇందువల్ల ఈ పథకం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఈ పథకం వల్ల కేవలం దేవాలయాలు, ట్రస్టులు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతున్నాయి.

 ఆర్‌బీఐ ఇలాంటి ప్రతిపాదన ఒకటి ఇప్పటికే చేసింది. దీనిపై నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నాం.

దిగుమతులపై నిబంధనలను మరింత కఠినతరం చేసినా, భారత్‌లో పసిడి డిమాండ్ ప్రస్తుత స్థాయి (వార్షికంగా దాదాపు 850 టన్నులు) దిగువకు పడిపోయే అవకాశం లేదు.
{పతిపాదిత గోల్డ్ కొత్త పథకాన్ని ప్రవేశపెడితే, దీని ద్వారా లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ధ్రువీకరణ పొందిన ఏకైక రిఫైనరీగా  ఎంఎంటీసీ పీఏఎంపీ మంచి ప్రయోజనం పొందగలుగుతుంది.  బ్యాంకులు నిర్దేశించిన విధంగా సమీకరణ, నాణ్యత నిర్ధారణ, రవాణా, రిఫైనింగ్, రి-ట్రాన్స్‌పోర్ట్‌సహా దేశంలో పసిడి సర్క్యులేషన్‌కు సంబంధించి విస్తృతస్థాయిలో సేవలను జేవీ నిర్వహిస్తుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)