amp pages | Sakshi

గరిష్టస్థాయిల వద్ద నిఫ్టీపై ఒత్తిడి

Published on Sat, 06/27/2020 - 11:03

నిఫ్టీ ఇండెక్స్‌ ఈ వారాన్ని లాభంతో ముగించింది. ఈ ఇండెక్స్‌ శుక్రవారం 94 పాయింట్లు పెరిగి 10,383 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒకవేళ మార్కెట్‌లో అప్‌ట్రెండ్‌ కొనసాగితే గరిష్టస్థాయిల వద్ద నిఫ్టీపై ఒత్తిడి కలిగే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ తదుపరి కదలికలపై ప్రముఖ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. 

అప్‌ట్రెండ్‌లో పరిమితి ర్యాలీకి అవకాశం: జీమిత్‌ మోదీ

నిఫ్టీకి అప్‌ట్రెండ్‌లో పరిమితి ర్యాలీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు సామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈవో జీమిత్‌ మోదీ తెలిపారు. నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం ప్రారంభ, ముగింపు స్థాయిలు దాదాపు ఒకేచోటు ఉండటంతో రోజువారీ ఛార్ట్‌లో డోజీ ప్యాట్రన్‌ ఏర్పాటైందని తెలిపారు.  ఈ ప్యాట్రన్స్‌ వీక్లీ స్కేల్‌లో స్పిన్నింగ్‌ టాప్‌ క్యాండిల్ ఏర్పడేందుకు తోడ్పడిందన్నారు. ఈ క్యాండిల్‌ నమూనా ఏర్పాటుతో రానున్న రోజుల్లో నిఫ్టీ అధికస్థాయిల ఇబ్బంది ఏర్పడనుందని విషయాన్ని సూచిస్తుందని ఆయన అంటున్నారు. ఈ టెక్నికల్‌ అంశాల దృష్ట్యా వచ్చే వారంలో నిఫ్టీకి 10550 స్థాయి కీలక నిరోధంగా మారనుందని మోదీ అన్నారు. 

 ‘‘ఈ వారంలో నిఫ్టీ ఇండెక్స్‌ 10,330 పాయింట్ల స్థాయిని అధిగమించింది. తర్వాత దానికి 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 10,550 పాయింట్ల స్థాయిని పరీక్షించిందని చేధించలేకపోయింది. కాబట్టి  ప్రస్తుతానికి నిఫ్టీలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతున్నప్పటికీ, ర్యాలీ పరిమితంగా ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో డౌన్‌ ట్రెండ్‌ బలపడితే నిఫ్టీ 9,700 స్థాయిని కూడా పరీక్షించవచ్చు.’’ అని జీమిత్‌ మోదీ తెలిపారు. 
 

గత రెండు సెషన్లలో నిఫ్టీ ట్రేడింగ్‌ సరళిని పరిశీలిస్తే 10,553–10,194 శ్రేణిలో కొత్త పరిధిని ఏర్పాటు చేసుకుందని ఛార్ట్‌వ్యూఇండియా డాట్‌ ఇన్‌ అధ్యక్షుడు మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. ఒకవేళ నిఫ్టీ 10553 స్థాయిని విజయవంతంగా బ్రేక్ చేయగలిగితే తదుపరి టార్గెట్‌ 10,900 స్థాయిగా నిలుస్తుందన్నారు.. 

కన్సాలిడేటివ్‌ మూడ్‌లో మార్కెట్‌: మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌

నిఫ్టీ డైలీ, వీక్లీ ఛార్ట్‌లను పరిశీలిస్తే మార్కెట్‌ కన్సాలిడేటివ్‌ మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు చందన్‌ తపారియా తెలిపారు. ‘‘నిఫ్టీ ఇండెక్స్‌ గడచిన 14వారాల్లో అత్యధిక గరిష్టస్థాయిని చూసింది. నిఫ్టీకి కీలక మద్దతు స్థాయిలు క్రమంగా అధిక స్థాయిలకు మారుతున్నాయి. దీంతో నిఫ్టీ చుట్టూ బుల్లిష్‌ వాతావరణం నెలకొంది. ఇప్పుడు నిఫ్టీకి అప్‌ట్రెండ్‌లో 10,555 వద్ద కీలక నిరోధం కలిగి ఉంది. డౌన్‌ట్రెండ్‌లో 10300 వద్ద మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోయి 10250 వద్ద మరో కీలక మద్దతు స్థాయి ఉంది.’’ ఆయన తెలిపారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?