amp pages | Sakshi

భారత్‌ వృద్ధిరేటుకు ఐఎంఎఫ్‌ కోత

Published on Tue, 01/17/2017 - 00:59

7.6% నుంచి 6.6%కి తగ్గింపు
నోట్ల రద్దు్ద కారణమని విశ్లేషణ
ద్రవ్యలోటు కట్టుతప్పుతుందన్న మూడీస్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా
క్యాడ్‌ పెరుగుతుందన్న నోముర  


వాషింగ్టన్, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, ఫిబ్రవరి 1 వార్షిక బడ్జెట్‌ నేపథ్యంలో భారత్‌ ఆర్థిక పరిస్థితి,  ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) వంటి స్థూల ఆర్థిక అంశాలపై అంచనాలు వెలువడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా వినియోగం తగ్గుతుందని, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015–16) వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.6 శాతంగా ఉంది.  ప్రపంచబ్యాంక్‌ కూడా వృద్ధి అంచనాను 7.6 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది.   ఇక భారీ వృద్ధి, వ్యయాలు లక్ష్యంగా ఉండడం వల్ల  వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ద్రవ్యలోటు లక్ష్యం నుంచి కేంద్రం పక్కకు తప్పుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్, ఆర్థిక సేవల దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ అంచనా వేశాయి.  నోట్ల రద్దు వల్ల కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) పెరిగే అవకాశం ఉందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ నోమురా అభిప్రాయపడుతోంది. వివరాలు..,

ప్రపంచవృద్ధి 3.1 శాతం: ఐఎంఎఫ్‌
2016లో పలు ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న తాత్కాలిక మందగమన ధోరణి 2017, 2018లో తిరిగి పుంజుకునే వీలుంది. 2016లో ప్రపంచ వృద్ధి 3.1 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 2017,18 సంవత్సరాల్లో ఈ రేటు వరుసగా 3.4 శాతం, 3.6 శాతాలుగా ఉండొచ్చు. అయితే 2016కు సంబంధించి చైనా వృద్ధి రేటు అంచనాలను స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగే వీలుంది. అయితే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రం భారత్‌ కొనసాగుతుంది.   2018లో భారత్‌ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటే, చైనా వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుంది.  వాణిజ్య అంశాలకు సంబంధించి రక్షణాత్మక విధానాలు కొంత ఒత్తిడులను సృష్టించే వీలుంది.

ద్రవ్యలోటు 3.5 శాతం: బీఓఎఫ్‌ఏఎల్‌: కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు బాట తప్పే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే 3.5 శాతం (రూ.5.33 లక్షల కోట్లు) దాటకూడదన్నది  బడ్జెట్‌ లక్ష్యం. అయితే వచ్చే ఏడాది ఈ రేటు 3 శాతానికి తగ్గాలన్నది ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణా చట్టం చెబుతున్న విషయం. అయితే దీనికి భిన్నంగా ద్రవ్యలోటును రానున్న బడ్జెట్‌లో కూడా 3.5 శాతంగానే కొనసాగించే వీలుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనావేస్తోంది.  

మూడీస్‌దీ అదే మాట...
ఇక మూడీస్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం 3.5 శాతం ద్రవ్యలక్ష్యాన్ని సాధించే వీలుందని మూడీస్‌ పేర్కొంది. అయితే  మౌలిక రంగాల వ్యయం అధికమయ్యే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది  ద్రవ్యలోటును3 శాతానికి కట్టడిచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తన తాజా నివేదికలో వివరించింది.

క్యాడ్‌ 1.3 శాతం: నోముర: 2017 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్‌ అకౌంట్‌ లోటు 1.3 శాతంగా ఉంటుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– నోమురా అంచానా వేసింది. ఇదిలాఉండగా, భారత్‌ వినియోగదారులు పూర్తిస్థాయిలో ఆశావహ ధోరణితో ఉన్నట్లు మాస్టర్‌కార్డ్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ కన్సూమర్‌ కాన్ఫెడెన్స్‌ (హెచ్‌2 2016)నివేదిక తెలిపింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌