amp pages | Sakshi

ప్రపంచ వృద్ధి అంచనాలకు కోత

Published on Thu, 03/07/2019 - 01:18

పారిస్‌: వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్‌ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక సహకార– అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను గత నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాలు 3.7 శాతంతో పోలిస్తే మరింత తగ్గించినట్టయింది. ‘‘విధానపరమైన అధిక అనిశ్చితి, కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వ్యాపార, వినియోగ విశ్వాసం మరింత క్షీణించడం అనేవి వృద్ధి తగ్గుదలకు దారితీస్తాయి’’ అని ఓఈసీడీ తన మధ్యంతర ఆర్థిక నివేదికలో వివరించింది. జీ20లోని అధిక దేశాల వృద్ధి అంచనాలను కూడా సవరించింది. 19 దేశాల యూరో జోన్‌ వృద్ధి అంచనాలు ఏకంగా 1.8% నుంచి 1%కి తగ్గిపోయాయి. జర్మనీ వృద్ధి అంచనాలు 1.4 శాతం నుంచి 0.7%కి తగ్గగా, ఇటలీ 0.9 శాతం నుంచి మైనస్‌ 0.2 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ వాణిజ్య మందగమనంతో ఈ రెండు దేశాలకు ఎక్కువ అవినాభావ సంబంధం కలిగి ఉండడమే వీటి వృద్ధి అంచనాల్లో భారీ కోతకు కారణమని ఓఈసీడీ వివరించింది.
 
బ్రిటన్‌ అంచనాలూ తగ్గింపు 
అలాగే, బ్రెగ్జిట్‌ సహా యూరోప్‌లో విధానపరమైన అనిశ్చితి ఎక్కువగా ఉందని తెలిపింది. అసంబద్ధంగా యూరోప్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగితే యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థల వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. బ్రిటన్‌ వృద్ధి అంచనాలను 1.4%నుంచి 0.8%కి సవరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 2009 తర్వాత ఇటలీ వృద్ధి అంచనాలు ఒక శాతం లోపునకు రావడం ఇదే ప్రథమం. అయితే, బ్రెగ్జిట్‌ (బ్రిటన్‌ బయటకు వెళ్లిపోవడం) ప్రక్రియ సాఫీగా సాగిపోవడం ఆధారంగానే ఈ మాత్రం వృద్ధి అంచనా వేసినట్టు ఓఈసీడీ తెలిపింది. అమెరికా, చైనా గతేడాది విధించుకున్న వాణిజ్య నియంత్రణలు... వృద్ధి, పెట్టుబడులు, జీవన ప్రమాణాలను పడదోస్తాయని వ్యాఖ్యానించింది.    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌