amp pages | Sakshi

ఆర్థిక, టెలికం శాఖలకు పీఏసీ అక్షింతలు

Published on Tue, 06/07/2016 - 00:57

టెలికం అండర్ ఇన్వాయిసింగ్‌ను గుర్తించలేదు
దీంతో ఖజానాకు నాలుగేళ్లలో రూ.12,488 కోట్ల నష్టం
ఈ రెండు శాఖల అసమర్థతే కారణమని విమర్శ

 న్యూఢిల్లీ: ఆరు టెలికం సంస్థలు 2006-2010 మధ్య తమ ఆదాయాలకు సంబంధించి అండర్ ఇన్వాయిస్ (బిల్లులు తక్కువ చేసే చూపించడం) విధానాలను అనుసరించాయని పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సోమవారం తేల్చిచెప్పింది. వీటిని గుర్తించలేకపోవడం ఆర్థిక, టెలికం శాఖల వైఫల్యమని పేర్కొంది. కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ, వొడాఫోన్, ఎయిర్‌టెల్, ఐడియా, ఎయిర్‌సెల్‌ల అండర్ ఇన్వాయిసింగ్ వల్ల 2006-10 మధ్య ప్రభుత్వం రూ.12,488 కోట్లు నష్టపోయినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) మూడు నెలల క్రితం పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించింది.

ఈ అంశాన్ని అధ్యయనం చేసిన పార్లమెంటరీ కమిటీ సోమవారం దీనిపై సంబంధిత అధికారులతో చర్చించింది. జరిగినదానికి ఆర్థిక, టెలికం శాఖలను తప్పుపట్టింది. ఈ రెండు శాఖలకు సంబంధించిన కొన్ని కార్యాలయాల అసమర్థ పని విధానమే దీనికి కారణమని విమర్శించింది. టెలికం శాఖలో కంట్రోలర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అకౌంట్స్ (పీఏసీ), ఆర్థికశాఖలో ఫైనాన్షియల్ విభాగం పటిష్టంగా పనిచేసి ఉంటే... ఖజానాకు ఈ నష్టం సంభవించి ఉండేది కాదని పీఏసీ చైర్మన్ కేవీ థామస్ పేర్కొన్నట్లు ఉన్నత వర్గాల సమాచారం.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌