amp pages | Sakshi

పారిస్ నిర్ణయాలు వెంటనే అమలు చేయాలి

Published on Sat, 04/23/2016 - 15:31

యునైటెడ్ నేషన్స్ : గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి పారిస్ అగ్రిమెంటులో తీసుకున్న చర్యలను వెంటనే అమలుచేసే ఒప్పందంపై 175 దేశాలు సంతకాలు చేశాయి. శుక్రవారం యునైటెడ్ నేషన్స్ లో జరిగిన ఈ సమావేశానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ' భూతాపం రోజురోజుకి పెరుగుతోంది. మంచు కరిగిపోతోంది. వాతావరణంలో కర్బన్ లెవల్స్ అధికమవుతున్నాయి. ప్రస్తుతం మనం సమయానికి వ్యతిరేకంగా వీటిని తగ్గించడానికి పోరాడుతున్నాం' అని యునైటెడ్ జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ అన్నారు. ఈ రోజు మనది తర్వాత తరం పిల్లలది, ముని మనవళ్లది కావాలంటే పారిస్ లో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

ఈ ఒప్పందంతో గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ల నుంచి వచ్చే ఉద్గారాలను స్థాయిని 55 శాతం వరకూ తగ్గించే బాధ్యత కనీసం 55 దేశాలపై ఉండనుంది. చిన్న చిన్న ద్వీపాలుగా ఉన్న దాదాపు 15 దేశాలు ఇప్పటికే గ్రీన్ హౌస్ గ్యాస్ ల నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గిస్తున్నాయి. ఈ ఉద్గారాల విడుదలలో అమెరికా, చైనాలు ముందు వరుసలో ఉన్నాయి. శుక్రవారం చేసుకున్న ఈ ఒప్పందంతో,  గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గించేందుకు యూఎస్, చైనాలు తమకు తాముగా ఆమోద ప్రక్రియపై సంతకం చేశాయి. శుక్రవారం కుదుర్చుకున్న ఒప్పందంతో పారిస్ అగ్రిమెంట్ ను చేరుకోవడానికి దేశాలకు ఇంకా ఒక ఏడాది సమయం ఉంది. 2017 ఏప్రిల్ 21 వరకూ ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది.    
 

Videos

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)