amp pages | Sakshi

వాహన విక్రయాలు తగ్గాయి!

Published on Wed, 01/02/2019 - 02:09

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో నెమ్మదించాయి. సంవత్సరాంతపు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఎన్ని ప్రకటించినా... వాహనాల విక్రయాలు మాత్రం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. జనవరిలో ధరలు కూడా పెరుగుతుండటం ఇక్కడ గమనార్హం. కాగా లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత వంటి ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల సవాళ్లు ఎదుర్కొవాల్సి వచ్చిందని హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ సేల్స్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్, ఎస్‌వీపీ రాజేష్‌ గోయల్‌ చెప్పారు. డిసెంబర్లో హ్యుందాయ్‌ మోటార్స్, టాటా మోటార్స్‌ అమ్మకాలు కేవలం ఒక శాతం వృద్ది రేటుకే పరిమితం కాగా.. మహీంద్రా అండ్‌ మహీంద్ర, మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు ఏకంగా తగ్గుదలను నమోదుచేశాయి. 

ఎం అండ్‌ ఎం: పీవీ సేల్స్‌ 4% డౌన్‌ డిసెంబర్‌లో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 15,091 యూనిట్లుగా నమోదైనట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ప్రకటించింది. 2017లో ఇదే కాలానికి విక్రయించిన 15,543 యూనిట్లతో పోలిస్తే 4 శాతం తగ్గుదల నమోదైంది. వాణిజ్య వాహన అమ్మకాల్లో సైతం 4 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. 

టాటా మోటార్స్‌: 
పీవీ విక్రయాలు 1 శాతం అప్‌
దేశీ విక్రయాల్లో 8%క్షీణత చోటుచేసుకుంది. 2018 డిసెంబర్‌లో 50,440 యూనిట్లు విక్రయించగా.. 2017 డిసెంబర్లో 54,627 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డిసెంబర్‌లో 14,260 యూనిట్లు కాగా, 2017 డిసెంబర్‌లో ఈ సంఖ్య  14,180.

హ్యుందాయ్‌:
4.6 శాతం వృద్ధి 
2018 డిసెంబర్‌లో 42,093 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 40,158 యూనిట్లతో పోలిస్తే 4.6 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రకటించింది. 

మారుతీ సుజుకీ: 
1.3 శాతం తగ్గిన పీవీ సేల్స్‌ గతనెల ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 1,28,338 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 1.3 శాతం తగ్గుదల నమోదయింది. దేశీ అమ్మకాలు మాత్రం 1,21,479 యూనిట్లకు చేరుకుని 1.8 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ తెలిపింది. మిని కార్‌ విభాగంలో ఆల్టో 27,661 యూనిట్లు, వ్యాగన్‌ఆర్‌ 27,661 యూనిట్లు అమ్ముడవగా.. కాంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్, డిజైర్‌ అమ్మకాలు 3.8 శాతం తగ్గినట్లు తెలిపింది.  

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?