amp pages | Sakshi

పీఎన్‌బీ హౌసింగ్‌లో వాటా విక్రయం!

Published on Thu, 07/12/2018 - 01:01

ముంబై: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలియజేసింది. కార్లైల్‌ గ్రూప్‌తో కలిసి కనీసం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో పీఎన్‌బీకి 32.79 శాతం వాటా, కార్లైల్‌ గ్రూప్‌కు చెందిన క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు 32.36 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 4.8 శాతం వాటాను ఈ ఏడాది మేలో క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా రూ.1,024 కోట్లకు విక్రయించింది.

తాజా వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్‌ 3.4 శాతం లాభంతో రూ.1,232 వద్ద ముగిసింది.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అనుబంధ కంపెనీ పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.62,252 కోట్లుగా ఉన్నాయి. ఇది దేశంలోనే ఐదో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)