amp pages | Sakshi

ఖతర్‌ ​కీలక చట్టం: విదేశీయులకు గుడ్‌న్యూస్‌

Published on Thu, 08/03/2017 - 15:35

సౌదీ నేతృత్వంలోని అరబ్‌ దేశాల నిషేధంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్‌, విదేశీయులకు గుడ్‌ న్యూస్‌ అందించింది. ఓ ల్యాండ్‌మార్కు బిల్లును ఖతర్‌ ఆమోదించింది. ఆ కీలక చట్టంతో ఖతర్‌కు వెళ్లే విదేశీయులకు శాశ్వత నివాస కార్డులు, కొత్త హక్కులు లభించనున్నాయి. ప్రస్తుతం ఖతర్‌ జనాభాలో విదేశీయులే ఎక్కువ. గల్ఫ్‌ ప్రాంతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఇదే కావడం విశేషం. విదేశీయులు ప్రభుత్వ సర్వీసులు పొందడానికి  ఈ చట్టం ఎంతో దోహదం చేస్తోంది. ఈ కొత్త చట్టం కింద కార్డుహోల్డర్స్‌ ఖతర్‌ జాతీయులగానే పరిగణించబడతారు. అంతేకాక అక్కడి రాష్ట్రాలు అందించే విద్యా, ఆరోగ్య పరమైన సర్వీసుల విషయంలో అన్ని ప్రయోజనాలను విదేశీయులు పొందుతారని ఖతర్‌ న్యూస్‌ ఏజెన్సీకి అధికారులు తెలిపారు. మిలటరీ, ప్రజా సంబంధమైన ఉద్యోగాల విషయంలో స్థానికుల తర్వాత వీరికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెప్పారు. 
 
 స్థానిక భాగస్వామి అవసరం లేకుండా వాణిజ్యపరమైన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని, సొంత ఆస్తులను కలిగి ఉండొచ్చని ఖతర్‌ న్యూస్‌ ఏజెన్సీ(క్యూఎన్‌ఏ) రిపోర్టు చేసింది. విదేశీయులను పెళ్లి చేసుకున్న ఖతారి మహిళల పిల్లలకు, రాష్ట్రాలకు అవసరమైన ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ప్రజలకు, దేశాలనికి చెప్పుకోదగ్గ సేవలు అందించిన వారు ఈ కార్డులకు అర్హులవుతారని క్యూఎన్‌ఏ తెలిపింది. ఈ కొత్త చట్టం ఖతార్‌ ప్రధాన వార్తలలో నిలుపుతుందని, ఇతరులతో పోలిస్తే, మరింత ముందస్తుగా ఆలోచించే దేశంగా పేరొందుతుందని  మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికా అనాలిస్టు అలిసన్‌ వుడ్‌ చెప్పారు. ఇలాంటి రెసిడెన్స్‌ ప్రొగ్రామ్స్‌ ఇక ఎలాంటి దేశాల్లో లేవన్నారు. ఆయిల్‌ ధరలు తగ్గడంతో గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌లో ఉన్న ఆరు గల్ఫ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా, ఒమెన్‌ మినహా మిగతా నాలుగు దేశాల్లో స్థానిక జనాభా కంటే కూడా విదేశీ వర్కర్లు, వారి కుటుంబసభ్యులే ఎక్కువ. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)