amp pages | Sakshi

పండుగ సీజన్‌లో పసిడి వెలవెల..

Published on Fri, 11/27/2015 - 01:10

డిసెంబర్ త్రైమాసికంలో
 8 ఏళ్ల కనిష్టానికి డిమాండ్
 వర్షాభావ పరిస్థితులతో తగ్గిన
 రైతుల ఆదాయాలు
 గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన కొనుగోళ్లు
 
 ముంబై: పెట్టుబడులపరమైన డిమాండ్ లేకపోవడం, వర్షాభావం వల్ల కరువుతో రైతుల ఆదాయాలు తగ్గిపోవడం తదితర అంశాల కారణంగా ఈసారి పండుగ సీజన్‌లో పసిడి అమ్మకాలు గణనీయంగా తగ్గనున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో పుత్తడి డిమాండ్ ఏకంగా 8 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం సాధారణంగా ఈ త్రైమాసికంలో అయిదేళ్ల సగటు చూస్తే డిమాండ్ 231 టన్నులు ఉండగా, గతేడాది 201.6 టన్నులుగా ఉంది. అయితే, ఈసారి మాత్రం 150-175 టన్నులు మాత్రమే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా తెలిపారు.
 
  వివాహాది శుభకార్యాలతో పాటు ధన్‌తేరస్, దీపావళి తదితర పండుగల సమయం కావడంతో దేశీయంగా పసిడి అమ్మకాల్లో మూడో వంతు విక్రయాలు డిసెంబర్ త్రైమాసికంలోనే జరుగుతుంటాయి. ఇక మూడింట రెండొంతుల డిమాండ్ గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటుంది. అయితే, వాతావరణ మార్పులతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం రైతుల ఆదాయాలను తత్ఫలితంగా వారి కొనుగోలు సామర్థ్యాన్ని దెబ్బతీసింది. దీంతో పండుగ సీజన్‌లోనూ గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ అంతంతమాత్రంగానే నమోదైంది. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ త్రైమాసికంలో పసిడి దిగుమతుల విలువ 5.7 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గొచ్చని పేర్కొన్నాయి.
 
 రూపాయి ఎఫెక్ట్ ..: అంతర్జాతీయంగా డాలర్ మారకంలో బంగారం రేట్లు అయిదేళ్ల కనిష్టానికి 9.3 శాతం మేర తగ్గినా.. ఇటు రూపాయి విలువా దాదాపు అయిదు శాతం క్షీణించడంతో భారత్‌లో పసిడి ధర తగ్గుదల 5.5 శాతానికి మాత్రమే పరిమితం అయ్యింది. ఇలా రేటు తగ్గాల్సిన స్థాయిలో తగ్గకపోవడం కూడా డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ధర ఇంకా పెరుగుతుందన్న ఆశలు లేకపోవడం వల్ల పెట్టుబడుల కోసం చేసే కొనుగోళ్లు కూడా పెద్దగా జరగలేదని వివరించాయి.
 
 వెయ్యి టన్నులు దాటనున్న దిగుమతులు..
 అంతర్జాతీయంగా రేట్ల తగ్గుదల ఊతంతో భారత్ దిగుమతులు ఈ ఏడాది ఆల్ టైమ్ గరిష్టం 1,000 టన్నుల స్థాయిని మించగలదని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ అంచనా వేసింది. 2014లో భారత్ 900 టన్నులు దిగుమతి చేసుకుంది. ధర తగ్గుదల ప్రయోజనాలు పొందేందుకు ఈ ఏడాది మరిన్ని దిగుమతులు జరుగుతున్నాయని ఫెడరేషన్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా పేర్కొన్నారు. ఫెడరేషన్ గణాంకాల ప్రకారం జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్ 850 టన్నులు దిగుమతి చేసుకుంది.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)