amp pages | Sakshi

రెనో క్విడ్, డాట్సన్ రెడీ గో కార్ల రీకాల్

Published on Thu, 10/13/2016 - 05:02

ఇంధన వ్యవస్థలో లోపాలు
సరిదిద్దడానికి చర్యలు...
51 వేల కార్లను రీకాల్ చేస్తున్న
రెనో నిస్సాన్... 932 కార్లు

 న్యూఢిల్లీ: వాహన కంపెనీ భారత్‌లో 50 వేలకు పైగా రెనో క్విడ్ కార్లను రీకాల్ చేస్తోంది. మరో వాహన కంపెనీ నిస్సాన్ డాట్సన్ రెడీ గో మోడల్‌లో 932 కార్లను రీకాల్ చేస్తోంది. ఇంధన వ్యవస్థలో లోపాలను సరిచేయడానికి, హోస్ క్లిప్‌ను జత చేయడానికి ఈ కార్లను రీకాల్ చేస్తున్నామని రెండు కంపెనీలు పేర్కొన్నాయి. 2015, అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే 18 వరకూ తయారైన క్విడ్ (800 సీసీ) ఎల్ వేరియంట్లలో స్వచ్ఛంద తనిఖీలు నిర్వహిస్తున్నామని రెనో కంపెనీ తెలిపింది. ఇంధన వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంధన వ్యవస్థను తనిఖీ చేస్తున్నామని, ఫ్యూయల్ హోస్ క్లిప్‌ను జత చేస్తున్నామని వివరించింది.

ఈ సమస్యలున్న కార్లను ఉచితంగా  తనిఖీ చేస్తామని, ఏమైనా అవసరమైన చర్యలుంటే తీసుకుంటామని పేర్కొంది. ఈ కార్లను కొనుగోలు చేసిన యజమానులను సంప్రదిస్తున్నామని, తనిఖీ కోసం కార్లను డీలర్ల వద్దకు తీసుకురావలసిందిగా కోరుతున్నామని వివరించింది. కాగా రీకాల్ కార్లలో 10 శాతం కార్లలో మాత్రమే ఈ సమస్యలున్నట్లు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన క్విడ్ 800 సీసీ కార్లను రూ.2.64-3.95 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో విక్రయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 56 వేల క్విడ్ కార్లను రెనో విక్రయించింది.

 మరోవైపు నిస్సాన్ కంపెనీ డాట్సన్ రెడీ గో మోడల్‌లో లోపాలున్న ఇంధన వ్యవస్థను సరిదిద్దడానికి 932 కార్లను రీకాల్ చేస్తోంది. ఈ ఏడాది మే 18 వరకూ తయారైన కొన్ని కార్లలో ఈ లోపాలున్న కార్లను గుర్తించామని తెలిపింది. ఈ మోడల్ కార్లు ఇప్పటివరకూ 14వేలు అమ్ముడయ్యాయి. క్విడ్, డాట్సన్ రెడీ గో కార్లు సీఎంఎఫ్‌ఏ ప్లాట్‌ఫార్మ్‌పై చెన్నై ప్లాంట్‌లోనే తయారయ్యాయి.

Videos

జగన్ పాటకు ఊగిపోయిన పిఠాపురం ప్రజలు

డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా

"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్

బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!

గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..

పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..

పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!

జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు

నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్

వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్.. దద్దరిల్లిన పిఠాపురం

Photos

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)