amp pages | Sakshi

కరోనా కల్లోలం : రూపాయి పతనం

Published on Wed, 04/08/2020 - 16:45

సాక్షి, ముంబై : ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను  అతలాకుతలం చేస్తోంది. లాక్ డౌన్  కారణంగా వినిమయ డిమాండ్ భారీగా  క్షీణిస్తోంది.  దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మరోవైపు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో లాక్ డౌన్ నిబంధనలు పొడిగించనున్నారనే అంచనాల నేపథ్యంలో  దేశీయ కరెన్సీరూపాయి బుధవారం మరింత క్షీణించింది. 75.83 వద్ద ప్రారంభమైన రూపాయి డాలరు మారకంలో 76 మార్కు దిగువకు పడిపోయింది. ఒక దశలో 76.36 ను తాకింది. చివరికి 74 పైసలు తగ్గి 76.37 వద్ద ముగిసింది. కరోనావైరస్ సంక్షోభం  డాలరుతో పోలిస్తే రూపాయి విలువ  6.98 శాతం క్షీణించింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు,  డాలరు బలం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు రూపాయిని దెబ్బతీశాయని విశ్లేషకులు తెలిపారు. ముడి చమురు ధరలు బ్యారెల్ కు 32 డాలర్లు పలికింది. ప్రపంచ బెంచ్ మార్క్ ముడి చమురు 3.6 శాతం తగ్గి 31.78 డాలర్లకు చేరుకుంది.డాలర్ ఇండెక్స్ ఆరు ప్రధాన కరెన్సీలతో గత ముగింపుతో పోలిస్తే బలంగా వుంది.  (కరోనా భయాలు : మార్కెట్ల పతనం)

మరోవైపు కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిపై పోరాటంలో భాగంగా  21 రోజుల లాక్ డౌన్  పదిహేనవ రోజుకు చేరింది. దేశంలోని వ్యాపారాలను, ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసిన లాక్ డౌన్ ను  వచ్చే వారం ప్రభుత్వం ఎత్తివేస్తుందా లేదా అనేదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.  దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలనుంచి పతనమైన చివరికు నష్టాలతో ముగిసాయి. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ట్రేడింగ్ గంటలను కుదించారు.  ఏప్రిల్ 17 వరకు ఉదయం 10నుంచి  మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌