amp pages | Sakshi

మరోసారి ఆల్‌టైం కనిష్టానికి రూపాయి

Published on Thu, 08/30/2018 - 09:55

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా రెండో రోజూ  నేల చూపులు చూస్తోంది. డాలరుతో మారకంలో మరోసారి సరికొత్త కనిష్ట రికార్డును సృష్టించింది.  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నీరసించిన రూపాయి 23 పైసలు(0.3 శాతం)  పతనమై 70.82ను తాకింది. ఇది ఆల్‌ టైం కనిష్టం.  కాగా  నిన్న( బుధవారం)  ఇంట్రాడేలో 54 పైసలు(0.8 శాతం) పతనమైంది. 70.65వద్ద రికార్డు పతననాన్ని నమోదు చేసింది. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి రూపాయి మారకపు విలువ 49 పైసలు(0.7 శాతం) కోల్పోయి 70.59 వద్ద ముగిసింది. తద్వారా డాలరుతో మారకంలో రూపాయి విలువ పాతాళానికి చేరింది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి క్షీణించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ డాలరుతో మారకంలో రూపాయి 9.5 శాతం పతనంకావడం గమనార్హం!

 ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువను భారీగా ప్రభావితం చేస్తున్నాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు బ్యారల్‌ తాజాగా 76 డాలర్ల సమీపానికి చేరగా,  న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 68.6 డాలర్ల వద్ద  ఉంది. అటు దేశీయంగానూ జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం రూపాయిని దెబ్బతీస్తుందని విశ్లేషకుల  అంచనా.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌