amp pages | Sakshi

ఆరంభ లాభాలు ఆవిరి

Published on Tue, 06/12/2018 - 00:56

ట్రేడింగ్‌ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఇంట్రాడేలో 261 పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 40 పాయింట్ల లాభంతో 35,483 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీ ఇంట్రాడేలో 10,800 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, చివరకు 19 పాయింట్ల లాభంతో 10,787 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఇంట్రాడేలో 83 పాయింట్ల లాభంతో 10,851 పాయింట్లను తాకింది. టెలికం, కన్సూమర్‌ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్‌ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, లోహ, ఆయిల్, గ్యాస్‌ షేర్లు నష్టపోయాయి.

జీ–7 సమావేశం ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, అందరి దృష్టి మంగళవారం నాటి అమెరికా అధ్యక్షడు డొనాల్ట్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల శిఖరాగ్ర సమావేశంపైనే పడింది. స్టాక్‌ సూచీలు మంచి లాభాలే సాధించాయని, అయితే ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం, రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.

నెస్లే ఇండియా @ 10,000
గత కొన్ని రోజులుగా రోజూ ఆల్‌టైమ్‌ హైని తాకుతున్న నెస్లే ఇండియా షేర్‌ ఇంట్రాడే రూ.10,050ను దాటింది. చివరకు స్వల్ప లాభంతో రూ.9,901 వద్ద ముగిసింది. కంపెనీ వెల్లడించిన గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించడం, వర్షపాతంపై సానుకూల అంచనాల కారణంగా ఈ షేర్‌ జోరుగా పెరుగుతోంది.

ఈ షేర్‌తో పాటు డి–మార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేర్‌ కూడా ఇంట్రాడేలో ఆల్‌ టైమ్‌ హై, రూ.1,620ని తాకింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. చివరకు రూ.1,594 వద్ద ముగియడంతో మార్కెట్‌ క్యాప్‌రూ.99,467కు పరిమితమైంది. రూ. 299 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చిన ఈ షేర్‌  442 శాతం లాభపడడం విశేషం. ఇక  బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఫైజర్, బజాజ్‌ ఫైనాన్స్, ఆస్ట్రాజెనెకా తదితర షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌