amp pages | Sakshi

స్టాక్స్ వ్యూ

Published on Mon, 09/21/2015 - 01:54

బజాజ్ ఫిన్‌సర్వ్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.1,835
టార్గెట్ ధర: రూ.2,102
ఎందుకంటే: బజాజ్ గ్రూప్‌కు చెందిన  బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్థిక దిగ్గజ కంపెనీగా ఎదిగింది. జీవిత బీమా, సాధారణ బీమా, కన్సూమర్ ఫైనాన్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక సేవలతో పాటు పవన విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది.  ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్.... ఈ మూడు వ్యాపారాల్లో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మంచి లాభాలార్జిస్తోంది.  అలయంజ్ ఎస్‌ఈ(జర్మన్) కంపెనీతో కలిసి జీవిత, సాధారణ బీమా కంపెనీలను ఏర్పాటు చేసింది. బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీవిత బీమా వ్యాపారాన్ని,  బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణ జీవిత బీమా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్(ఇది కూడా స్టాక్ మార్కెట్లో లిస్టయింది.

బజాజ్ ఫిన్‌సర్వ్‌కు  ఇది లిస్టెడ్ అనుబంధ సంస్థ. బజాజ్ ఫైనాన్స్‌లో  బజాజ్ ఫిన్‌సర్వ్‌కు  57.6 శాతం వాటా ఉంది) వినియోగదారులకు, వాహన, వినియోగ వస్తువుల రుణాలందిస్తోంది. భారత్‌లో అతి పెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో ఒకటిగా బజాజ్ ఫైనాన్స్  నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బజాజ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు రూ.32,410 కోట్లకు పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్  లోన్ బుక్ నాలుగేళ్లలో నాలుగింతలైంది. ఆదాయం 13 శాతం, నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇక బజాజ్ ఫిన్‌సర్వ్   మహారాష్ట్రలో 138 విండ్ మిల్స్‌తో 64 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. రెండేళ్లలో బజాజ్ ఫిన్‌సర్వ్  నికర అమ్మకాలు 14 శాతం, నికరలాభం 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.  
 
గుజరాత్ పిపవావ్
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.175
టార్గెట్ ధర: రూ.202
ఎందుకంటే: ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ ఆపరేటర్లలో ఒకటైన ఏపీఎం టెర్మినల్స్ దన్నుతో  గుజరాత్ పిపవావ్ పోర్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్ పిపవావ్‌లో ఏపీఎం టెర్మినల్స్‌కు 43 శాతం వాటా ఉంది. భారత ప్రైవేట్ రంగంలో తొలి పోర్ట్ కంపెనీ అయిన గుజరాత్ పిపవావ్  కంపెనీ కార్గో హ్యాండ్లింగ్, వేర్‌హౌస్, సీఎఫ్‌ఎస్ సౌకర్యాలనందిస్తోంది.  ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర అమ్మకాలు 10% వృద్ధితో రూ.185 కోట్లకు చేరాయి. నికర లాభం ఫ్లాట్‌గా రూ.80 కోట్లుగా నమోదైంది.  రెండేళ్లలో నికర అమ్మకాలు 22%, నికర లాభం 56% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.  ఏపీఎం టెర్మినల్స్ సంస్థ భారత రైల్వేలతో కలిసి పిపవావ్ రైల్వే కార్పొరేషన్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.

భారత్‌లో డబుల్ స్టాక్ ట్రైన్స్(ఒక బోగీపై మరో బోగీ ఉన్న రైళ్లు)ను ప్రవేశపెట్టనున్న తొలి కంపెనీ ఇదే కానున్నది. నైరుతీ భారత దేశంలో ప్రధానమైన ఇన్‌లాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ-కంటైనర్ కార్గోను తాత్కాలికంగా స్టోరేజ్, హ్యాండ్లింగ్ చేసే డ్రై పోర్టులు)లతో అనుసంధానతను మరింత మెరుగుపరచుకుంది. దీనికోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సముద్ర వాణిజ్యానికి కీలకమైన మార్గంలో ఈ పోర్ట్ ఉంది. దాద్రి నుంచి రీఫర్ రాక్స్(రిప్రిజిరేటర్ లాజిస్టిక్స్) సౌకర్యం ఉన్న గుజరాత్‌లోని ఏకైక పోర్ట్ ఇదొక్కటే. దీంతో పశ్చిమాసియా, ఈజిప్ట్, మధ్యధరా దేశాల, ఆఫ్రికా, యూరప్ పోర్ట్‌లతో నేరుగా అనుసంధానం ఏర్పర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ. 202 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం.

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)