amp pages | Sakshi

క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఎదురుదెబ్బ

Published on Wed, 07/04/2018 - 00:12

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఆర్‌బీఐ ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో బిట్‌కాయిన్‌ విలువ ఒక్కసారిగా పతనమైంది. ఏకంగా రూ. 10 వేల మేర క్షీణించింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం కాయిన్‌గెకోడాట్‌కామ్‌లో ఒక దశలో బిట్‌కాయిన్‌ విలువ రూ. 4,58,105 నుంచి రూ. 4,47,998కి పడిపోయింది.

క్రిప్టోకరెన్సీలను ఉపయోగించే సంస్థలు, ట్రేడర్లు, వ్యక్తులకు.. సదరు వర్చువల్‌ కరెన్సీపరమైన సర్వీసులను, వ్యాపార లావాదేవీలను నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ జూలై 6న సర్క్యులర్‌ జారీ చేసింది. ఇందుకు మూడు రోజుల గడువిచ్చింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంలతో పాటు వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి కూడా ఇది శరాఘాతంగా మారింది.

బ్యాంకింగ్‌ మార్గం మూసుకుపోవడంతో క్రిప్టోకరెన్సీపరమైన లావాదేవీలన్నీ తప్పనిసరిగా నగదు రూపంలోనే నిర్వహించాల్సి వస్తుందని.. అది కుదరకపోవచ్చు కనుక మొత్తానికి లావాదేవీలన్నీ నిల్చిపోయే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఆదేశాలను సవాలు చేస్తూ ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆర్‌బీఐ నిర్ణయం ఏకపక్షమైనదని, రాజ్యాంగవిరుద్ధమని వాదించింది. అయినప్పటికీ.. ఆర్‌బీఐ ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?