amp pages | Sakshi

వృద్ధికి ‘తయారీ’ జోష్..

Published on Tue, 12/01/2015 - 01:53

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4 శాతం జీడీపీ వృద్ధి రేటు
ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాలో భారత్
తయారీ రంగం వృద్ధి రేటు 9.3 శాతం  మైనింగ్, సేవా రంగాలూ ఊతం
 
 న్యూఢిల్లీ:
ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్నట్లు సోమవారం వెల్లడైన తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2015-16, జూలై-సెప్టెంబర్) భారత్ 7.4 శాతం ఆర్థికాభివృద్ధిని నమోదుచేసుకుంది. తయారీ, మైనింగ్, సేవా రంగాల చక్కని పనితీరు... మొత్తం ఫలితం పటిష్టతకు కారణమైంది.
 
  జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం. కాగా గడచిన కొన్ని నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో (బ్యాంకులు తాము ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు) రేటు కోత కూడా తాజా ఫలితానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  డిసెంబర్ 1వ తేదీన ఆర్‌బీఐ ఐదవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) తాజాగా విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి ముఖ్యాంశాలు..
 
 2014-15 క్యూ 2తో పోల్చితే ప్రస్తుత రేటు తక్కువే. గత సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది.
 కాగా ఈ ఏడాది ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు 6.9 శాతం. దీనితో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతున్నట్లయ్యింది.  ఇదే కాలంలో వర్థమాన దేశాల్లో కీలకమైన రష్యాలో అసలు వృద్ధి లేకపోగా -4.1 క్షీణత నమోదయ్యింది. బ్రెజిల్ సైతం -4.2 శాతం క్షీణతలో ఉంది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటే... గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 7.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.1 శాతం నుంచి 8.5 శాతం వరకూ వృద్ధి నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నప్పటికీ, ఇప్పటికి గడిచిన రెండు త్రైమాసికాల్లో ఈ రేటు లక్ష్యానికి భారీ దూరంలో ఉన్న సంగతి గమనార్హం.
 తాజా గణాంకాల ప్రకారం 7 శాతానికి పైగా వృద్ధిని నమోదుచేసుకున్న రంగాల్లో తయారీ, వాణిజ్యం, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్ ఉన్నాయి. బ్రాడ్‌కాస్టింగ్, ఫైనాన్స్, బీమా, రియల్టీ, వృత్తిపరమైన సేవా రంగాలూ 7 శాతం పైగా వృద్ధిని సాధించాయి.
 
 తయారీ రంగం సెప్టెంబర్ క్వార్టర్‌లో భారీగా 9.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 7.9 శాతమే.
 మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 3.2 శాతానికి ఎగసింది.
 ట్రేడ్, హోటల్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్లతో సహా మొత్తం సేవా రంగాల వృద్ధి రేటు 8.9 శాతం నుంచి 10.6 శాతానికి ఎగసింది.
 కాగా ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో వృద్ధి మాత్రం 13.5 శాతం నుంచి 9.7 శాతానికి తగ్గింది.
 
 విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు కూడా 8.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
 వ్యవసాయం, అనుసంధాన రంగాల్లో వృద్ధి రేటు స్వల్పంగా 2.1 శాతం నుంచి 2.2 శాతానికి పెరిగింది.
 నిర్మాణ రంగంలో వృద్ధిరేటు 8.7 శాతం నుంచి 2.6 శాతానికి పడింది.
 2011-12 స్ధిర ధరల ప్రకారం... జీడీపీ విలువ రెండవ త్రైమాసికంలో రూ.27.57 లక్షల కోట్లుగా నమైదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 25.66 లక్షల కోట్లు. అంటే జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతమన్నమాట.
 
 మరింత మెరుగవుతుంది..
 గత ఆర్థిక సంవత్సరం సాధించిన 7.3% వృద్ధిరేటుకన్నా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మంచి వృద్ధి నమోదవుతుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా... తయారీ రంగం మంచి ఫలితాన్ని ఇవ్వడం గమనార్హం.  మొత్తంగా ఈ గణాంకాలు సంతృప్తిని ఇస్తున్నాయి. మున్ముందు మరింత వృద్ధి ఖాయం.
                                                                                                   - అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి
 
 సానుకూల ధోరణి...

 దేశ ఆర్థిక రంగానికి సంబంధించి సానుకూల ధోరణి పటిష్టతకు తాజా గణాంకాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.5%గా నమోదవుతుందన్నది అభిప్రాయం. ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్నదని సంకేతాలు అందుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వృద్ధికి మరింత ఊపునిస్తుంది.
                                                                                                - శక్తికాంత దాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి
 

 వేగవంతమైన రికవరీ...
 ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగవంతమైందనడానికి తాజా గణాంకాలు నిదర్శనం. ఈ తరహా ధోరణి మేము ఊహించిందే. అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆందోళనకరం. తయారీ, రియల్టీ, మౌలిక రంగాల్లో నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణపై తక్షణం విధానపరమైన దృష్టి పెట్టాలి.
                                                                                                           - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్
 

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)