amp pages | Sakshi

వేలాది ఆధార్‌ కార్డులు అలా...అవాక్కయ్యేలా!

Published on Tue, 03/13/2018 - 15:28

సాక్షి, ముంబై: ఒకవైపు బ్యాంకు ఖాతా, సంక్షేమ పథకాలు సహా పలు రకాలుగా  ఆధార్‌ నంబర్‌ను అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుండగా ఓ షాకింగ్‌ ఉదంతం  ఒకటి   కలకలం రేపింది.  ఒక పాడుబడిన బావిలో ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులు దర్శనమివ్వడం  షాకింగ్‌కు గురి చేసింది. మహారాష్త్ర యవత్‌మాల్‌లోని  షిండేనగర్‌  ప్రాంతంలో ఆదివారం ఈ  సంఘటన  చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..తాగునీటికి తీవ్ర కొరత దృష్ట్యా నీటి వనరులను ఉపయోగించుకునేలా  కొంతమంది యువకులు  చొరవ చూపారు.  ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఒక బావిని బాగు చేసుకునేందుకు రంగంలోకి దిగారు. యవత్‌మాల్‌ నగరంలోని యువకుల ప్రయత్నాన్ని  అభినందించిన  జిల్లా కలెక్టర్‌ రాజేష్‌ దేశ్‌ముఖ్‌తోపాటు కొంతమంది ఎన్‌జీవోలు కూడా బావులు నుంచి  చెత్తను తొలగించటానికి ముందుకు వచ్చాయి.  ఇక్కడే అందరూ విస్తుపోయేలా సంఘటన.. వేలాది ఒరిజినల్‌ ఆధార్‌కార్డుల సంచులు వెలుగు చూశాయి. నైలాన్ గోనె సంచుల్లో ప్యాక్ చేసి, రాళ్ళతో  కట్టిమరీ పారవేసిన వేలాది ఆధార్‌ కార్డులను వారు కనుగొన్నారు.  దీంతో అవాక్కయైన అధికారులు విచారణకు ఆదేశించారు.   దర్యాప్తుకోసం ఒక కమిటినీ  ఏర్పాటు చేశామని,  పూర్తి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు. మరోవైపు బావిలో ఉన్న ఆధార్‌కార్డుల పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, వివరాలు  వివరాలు చదవగలిగేలా ఉన్నాయట.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)