amp pages | Sakshi

లక్ష్యానికో పాలసీ..

Published on Sun, 12/14/2014 - 00:35

ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుండటంతో పాలసీదారులను ఆకర్షించడానికి బీమా కంపెనీలు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ మధ్యనే ఎల్‌ఐసీ లిమిటెడ్ పేమెంట్ ఎండోమెంట్ పాలసీని ప్రవేశపెడితే, ఐడీబీఐ హోల్ లైఫ్ పాలసీని, బజాజ్ అలయంజ్ రిటైర్మెంట్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ పేరుతో రకరకాల పాలసీలను ప్రవేశపెడుతున్నాయి. బీమారంగంలో ఉన్న వివిధ పాలసీలు, అవి ఎవరికి అనువుగా ఉంటాయో వివరించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ..
 
జీవిత బీమా రక్షణ దగ్గర నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకునే అవకాశాన్ని బీమా కంపెనీలు అందిస్తున్నాయి. అలాగే వైద్య చికిత్స వ్యయాన్ని కూడా భరిస్తున్నాయి. మీ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను బట్టి సరిపోయే పాలసీని ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ బీమా పథకాలు, అవి ఏ అవసరాలు, లక్ష్యాలకు అనువుగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం...
 
టర్మ్ పాలసీలు

ఇది బీమా అర్థానికి 100 శాతం సార్థకతను ఇస్తుంది. అంటే ఇది కేవలం బీమా రక్షణను మాత్రమే అందిస్తుంది. ఈ పాలసీల్లో క్లెయిమ్‌లు తప్ప ఎటువంటి మెచ్యూర్టీ ఉండదు. అలాగే పాలసీ కాలపరిమితిలోగా క్లెయిమ్‌లు జరగకపోతే కాలపరిమితి తీరిన తర్వాత కట్టిన ప్రీమియం కూడా వెనక్కి రాదు. అందుకే టర్మ్ పాలసీల ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా ప్రయోజనాన్ని కల్పించే లక్షణాన్ని టర్మ్ పాలసీలు కలిగివుండటంతో ఇప్పుడివి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

ఏజెంట్ ప్రమేయం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో తీసుకుంటే ప్రీమియంలు మరింత తక్కువగా ఉంటున్నాయి. కాని ఆన్‌లైన్‌లో తీసుకునేటప్పుడు ఒక అంశాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. కేవలం ప్రీమియం తక్కువగా ఉందని కాకుండా, ఆ కంపెనీ క్లెయిమ్ చరిత్ర పరిశీలించి పాలసీ తీసుకోవాలి. దీర్ఘకాలానికి ఈ పాలసీని తీసుకోవడం వలన వయసు పెరుగుతున్నా తక్కువ ప్రీమియంతోనే బీమా ప్రయోజనాన్ని కొనసాగించొచ్చు. ఎల్‌ఐసీతో సహా అన్ని కంపెనీలు ఈ టర్మ్ పాలసీలను అందిస్తున్నాయి.
 
ఎండోమెంట్ ప్లాన్
బీమా రక్షణతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ముఖ్యంగా పిల్లల చదువు, పెళ్లి, సొంతింటి నిర్మాణం, కారు కొనుక్కోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఎండోమెంట్ పథకాలు అనువుగా ఉంటాయి. ఇవి నిర్దిష్ట కాలానికి బీమా రక్షణ కల్పిస్తూ, కాలపరిమితి ముగిసిన తర్వాత మెచ్యూరిటీ కింద మొత్తం సొమ్మును ఒకేసారి అందిస్తాయి.  కంపెనీల మధ్య పోటీ పెరగడంతో బీమా కంపెనీలు ఇప్పుడు విభిన్నమైన ఎండోమెంట్ పాలసీలను అందిస్తున్నాయి.

సాధారణంగా ఎండోమెంట్ పాలసీల్లో పాలసీ కాలపరిమితి వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారస్తులు, తక్కువ కాలం ప్రీమియం చెల్లించే వారి కోసం ఇప్పుడు బీమా కంపెనీలు పరిమిత కాలం ప్రీమియం చెల్లించే పాలసీలను కూడా అందిస్తున్నాయి. ఈ మధ్య ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్స్ ఈ కోవలోకే వస్తాయి.
 
హోల్‌లైఫ్ పాలసీలు
సాధారణంగా జీవిత బీమా రక్షణ కేవలం పాలసీ కాలపరిమితి వరకే ఉంటుంది. అలా కాకుండా జీవితాంతం బీమా రక్షణ కోరుకునే వారి కోసం ఇప్పుడు హోల్ లైఫ్ పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి జీవిత కాలం అంటే 85 నుంచి 100 ఏళ్ల వరకు బీమా రక్షణ కల్పిస్తాయి. అలా అని 100 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ కాలపరిమితి అయిన తర్వాత మెచ్యూరిటీ మొత్తం ఇచ్చిన తర్వాత కూడా 100 ఏళ్ల వరకు బీమా రక్షణ కొనసాగించడం ఈ పాలసీల్లో ప్రధాన ఉద్దేశం. టాటా ఏఐఏ మహాలైఫ్ గోల్డ్ ప్లస్ పాలసీలో కేవలం 15 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే 85 ఏళ్ల వరకు బీమా రక్షణ లభిస్తుంది. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ 100 ఏళ్ల వరకు బీమా రక్షణ కల్పించే విధంగా హోల్‌లైఫ్ సేవింగ్స్ ప్లాన్‌ను అందిస్తోంది.
 
మనీ బ్యాక్ ప్లాన్
సంపాదన ప్రారంభమైన సమయంలో బాధ్యతలు తక్కువగా ఉండి, వయసుతో పాటు పెరుగుతుంటాయి. ఇలాంటి వారికి మధ్య మధ్యలో ఆర్థిక ఉపశమనాన్ని మనీ బ్యాక్ పాలసీలు కల్పిస్తాయి. వీటి పేరులో ఉన్నట్లుగానే పాలసీ కొనసాగుతుండగానే మధ్య మధ్యలో కొంత మొత్తం చొప్పున వెనక్కి ఇస్తుంటాయి.  ప్రతీ మూడేళ్లకు ఒకసారి లేదా ఐదేళ్లకు ఒకసారి చొప్పున ఇలా నగదును వెనక్కి ఇస్తుంటాయి. సాధారణ ఎండోమెంట్ పాలసీలతో పోలిస్తే మనీ బ్యాక్ పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది.

దీనికి కారణం మధ్యమధ్యలో నగదును వెనక్కి ఇవ్వడమే. అంతే కాకుండా మధ్య మధ్యలో ఇలా నగదు వెనక్కి ఇవ్వడం వల్ల మెచ్యూరిటీ సమయంలో అందుకునే మొత్తం తక్కువగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో పెద్ద మొత్తం అందుకోవాలనుకునే వారికి ఇవి అనువైనవి కావు. బాధ్యతలు పెరిగిన తర్వాత ఆర్థిక వెసులుబాటు కావాలనుకునే వారికి ఇవి అనువైనవని చెప్పొచ్చు. ముఖ్యంగా పిల్లల చదువుల కోసం అందించే పాలసీల్లో అధిక శాతం మనీ బ్యాక్‌కు చెందినవి ఉంటాయి.
 
పెన్షన్ ప్లాన్స్
రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవాలనుకునే వారికి ఈ  ప్లాన్స్ బాగుంటాయి. ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్స్ ఎండోమెంట్, యులిప్స్‌లో లభిస్తున్నాయి. సాధారణంగా అన్ని బీమా పథకాలు 55 నుంచి 60 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ విధంగా సమకూర్చిన మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి చొప్పున పెన్షన్ పొందచ్చు. సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే రిటైర్మెంట్‌కు కేటాయించడం మొదలు పెడితే మంచిది. ఉద్యోగం చేస్తున్న సంస్థలో పెన్షన్ సౌకర్యం ఉన్నా ఇంకా అదనపు మొత్తం కావాలనుకునే వారు కూడా తీసుకోవచ్చు.
 
యులిప్స్...
ఇటు బీమా రక్షణ, అటు పన్ను ప్రయోజనాలతో పాటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలు పొందాలనుకునే వారికి యులిప్స్ అనువైనవి. వీటి పని తీరు ఇంచుమించు మ్యూచువల్ ఫండ్స్‌లాగానే ఉంటుంది. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి.. లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తారు. అందువల్ల వీటి రాబడులపై కచ్చితమైన హామీ ఉండదు.  మీ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వివిధ రకాల ఫండ్ ఆప్షన్స్‌ను అందిస్తున్నాయి. యులిప్స్‌లో ఉండే అధిక చార్జీలను ఐఆర్‌డీఏ తగ్గించడంతో ఇప్పుడివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎల్‌ఐసీ ఎటువంటి యులిప్ పథకాన్ని అందించడం లేదు. దాదాపు అన్ని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని అందిస్తున్నాయి.
 
హెల్త్ పాలసీలు
చికిత్స వ్యయ భారాల తీవ్రత నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా అవసరం. వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు కూడా ఈ  పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీ వల్ల చికిత్స వ్యయాలను బీమా కంపెనీలు భరి స్తాయి. భారీ వ్యయంతో కూడుకున్న తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు చికిత్స వ్యయంతో సంబంధం లేకుండా పాలసీ మొత్తం ఒకేసారి చెల్లించేలా క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌లూ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
 
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)