amp pages | Sakshi

విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 8,636 కోట్లు

Published on Wed, 01/06/2016 - 02:27

ఉక్కునగరం(విశాఖ): దేశీయ ఉక్కు  పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పటికీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ఆర్థిక(2015-16) సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఉత్పత్తి,  అమ్మకాల్లో మంచి ప్రగతి కనబరచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే తొమ్మిది నెలలతో పోలిస్తే సేలబుల్ స్టీల్ ఉత్పత్తిలో 21 శాతం వృద్ధి సాధించడంతో పాటు బ్లాస్ట్‌ఫర్నెస్ ఉత్పాదకత, తలసరి నీటి వినియోగం, కార్మిక ఉత్పాదకతలో వృద్ధి సాధించింది. సింటర్, ద్రవ ఉక్కు, వైర్ రాడ్‌ల ఉత్పత్తిలో ఈ మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించింది. అదే విధంగా ఎగుమతుల్లో 28 శాతం వృద్ధితో రూ. 935 కోట్లకు చేరగా, ఈ తొమ్మిది నెలల్లో అమ్మకాలు 8 శాతం వృద్ధితో రూ. 8,636 కోట్లకు పెరిగాయి.

ఒక్క డిసెంబర్ నెలలోనే 5 లక్షలు టన్నుల అమ్మకాలతో రూ. 1,617 కోట్లు సాధించడం గమనార్హం. అమ్మకాల్లో చూపుతున్న ప్రగతికి గాను  కేంద్ర వాణిజ్య  మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ కౌన్సిల్ స్టీల్‌ప్లాంట్‌కు వరుసగా రెండోసారి స్టార్ ఫెర్ఫార్మర్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో వార్షిక లక్ష్యాలను అధిగమించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌