amp pages | Sakshi

పట్టించుకోని మార్కెట్‌

Published on Wed, 12/12/2018 - 01:44

అనుకోనిది జరగకపోవడమే మార్కెట్‌. ఈ మాట మంగళవారం స్టాక్‌ మార్కెట్‌కు బాగా వర్తిస్తుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో సహజంగానైతే స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోవాలి. కానీ దీనికి భిన్నంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 35,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్లపైకి ఎగబాకాయి. భారీ నష్టాలతో ఆరంభమైనా, ఈ నష్టాలన్నింటినీ రికవరీ చేసుకొని స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాట పట్టింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 190 పాయింట్ల లాభంతో 35,150 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 10,549 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌లు, వినియోగ, ఐటీ, వాహన షేర్లు లాభపడ్డాయి. సోమవారం సెన్సెక్స్‌ 714 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున పతనమైన విషయం     తెలిసిందే.  

మధ్నాహ్నం తర్వాత కొనుగోళ్లు... 
ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అనూహ్యంగా రాజీనామా చేయడంతో డాలర్‌తో రూపాయి మారకం నష్టాల్లో ఆరంభమైంది. దీంతో స్టాక్‌ సూచీలు భారీ నష్టాల్లో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ 376 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్ల భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. మొదట్లోనే ఈ నష్టాలు మరింతగా పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 534 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్ల వరకూ నష్టపోయాయి. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి స్టాక్‌సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 247 పాయింట్లు, నిఫ్టీ 79 పాయింట్లు లాభపడ్డాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 781 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. ఒక విధంగా చూస్తే,  ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాను, బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన ఎన్నికల ఫలితాలను మార్కెట్‌ పట్టించుకోలేదనే చెప్పాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో బీజేపీకి మరీ తక్కువగా కాకుండా, అంచనాలను మించే సీట్లు రావడం సానుకూల ప్రభావం చూపించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను మార్కెట్‌ సోమవారమే డిస్కౌంట్‌ చేసుకుందని వారు వివరించారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  సీఈఓ ఎంపికకు సంబంధించిన కీలకమైన సమావేశం రేపు (గురువారం) జరగనుండటంతో యస్‌బ్యాంక్‌ షేర్‌ 7.2 శాతం లాభంతో రూ. 177 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.    

Videos

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?