amp pages | Sakshi

పెట్టుబడికి ఏది సరి?

Published on Sat, 01/07/2017 - 00:08

నివాసమా.. వాణిజ్య సముదాయమా? దేన్లో అధిక రాబడి
సాక్షి, హైదరాబాద్‌: ఫ్లాటా? ప్లాటా? లేక వాణిజ్య సముదాయంలో స్థలమా? దేన్లో పెట్టుబడి భవిష్యత్తులో పెడితే ధర పెరుగుతుంది? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే మనలో చాలా మంది పెట్టుబడి అనే సరికి నివాస గృహాలపైనే దృష్టి సారిస్తారు. కానీ, వాస్తవానికి వాణిజ్య సముదాయాల్లోనే అధిక రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే విస్తీర్ణం తక్కువ గల స్థలంలో పెట్టుబడి చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని వారంటున్నారు.

ప్రాజెక్ట్‌ ఏదైనా అందుబాటులో ఉన్న ప్రాంతంలో నిర్మాణాల్ని చేపడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తారు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వాణిజ్య సముదాయాల్ని నిర్మిస్తున్నాయి.

వాణిజ్యమే బెటర్‌..
పెట్టుబడి కోణంలో చూసేవారు మంచి రాబడిని అందుకోవడానికి రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణుల సూచన. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకకపోవటమే ఇందుకు కారణం. గృహ రుణాలతో పోల్చితే వాణిజ్య సముదాయాల రుణాల వడ్డీ కూడా 2–4 శాతం దాకా అధికంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోల్చితే వాణిజ్య సముదాయాల్లో నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది కూడా. అయితే నివాసంతో పోల్చితే వాణిజ్య భవనాల్లో కొనుగోలు ధర మాత్రం యాభై శాతం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ. 3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ. 5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది.

అయితే ప్రమోటర్లే స్వయంగా నిర్వహించే వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యమివ్వాలి. ఏటా కొంత మొత్తాన్ని సేవా రుసుముగా తీసుకొని ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సేవల్ని అందించే వాటిని ఎంచుకోవటం మేలు. వీటితో అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్టుగా అద్దెదారుల్ని ఎంపిక చేయడం, వారు కోరుకున్న సైజుల్లో స్థలాన్ని సమకూర్చడం, దస్తావేజుల్ని సిద్ధం చేయడం, క్రమం తప్పకుండా అద్దెలను వసూలు చేయడం, ఆయా సొమ్మును పెట్టుబడిదారుడికి ఖాతాలో జమ చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని ప్రాపర్టీ మేనేజర్లే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. దీని వల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఫస్ట్‌ అయితే నివాసమే ఉత్తమం..
మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారెవరైనా సరే నివాస సముదాయాన్ని కొనుగోలు చేయడమే ఉత్తమం. ఆరంభంలో ఇరవై శాతం సొమ్ము కడితే చాలు 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహæరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. ఇరవై, పాతికేళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని కట్టే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. చేతిలో సొమ్ము ఉన్నప్పుడల్లా.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. అయితే ఆయా ప్రాజెక్ట్‌కు అనుమతులున్నాయా లేవా తెలుసుకోవాలి. అభివృద్ధి చెందే ప్రాంతంలో, టైటిల్‌ క్లియర్‌గా ఉండి, నిర్వహణ సక్రమంగా ఉన్న వాటి విలువనే పెరుగుతాయని మరవొద్దు.

స్థిరాస్తులకు సంబంధించి మీ సందేçహాలు మాకు రాయండి.realty@sakshi.com

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)