amp pages | Sakshi

వాట్సాప్‌ వీడియో కాల్స్‌ ఆన్సర్‌ చేస్తున్నారా..?

Published on Thu, 10/11/2018 - 17:12

ఇన్‌కమింగ్‌ వీడియో కాల్స్‌ ఆన్సర్‌ చేస్తున్న సమయంలో హ్యాకర్లు యాప్‌ను క్రాష్‌ చేసేలా సహకరిస్తున్న ఓ బగ్‌ను ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సాప్‌ గుర్తించింది. ఈ విషయాన్ని ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్లు జీడీనెట్‌, ది రిజిస్టార్‌ రిపోర్టు చేశాయి. ఈ బగ్‌తో ఆపిల్‌ ఐఫోన్ల వాట్సాప్‌ అప్లికేషన్లు, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రభావితం కానున్నాయని పేర్కొంది. ఆగస్టులోనే ఈ బగ్‌ను వాట్సాప్‌ గుర్తించిందని తెలిసింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌కు ప్రస్తుతం 1.5 బిలియన్‌ పైగా యూజర్లున్నారు. అయితే ఈ బగ్‌ బారిన ఎంత మంది యూజర్లు పడ్డారో ఇంకా తెలియరాలేదు. 

వాట్సాప్‌ వీడియో కాల్‌లో బగ్‌ ఉన్నట్టు నటాలీ సిల్వనోవిచ్ అనే సెక్యురిటీ రీసెర్చర్‌, గూగుల్‌ ప్రాజెక్ట్‌ జీరో సెక్యురిటీ రీసెర్చ్‌ టీమ్‌తో కలిసి కనుగొన్నారు. వాట్సాప్‌ వీడియో కాల్‌ను ఎత్తిన వెంటనే అటాకర్‌, యూజర్‌ వాట్సాప్‌ అంతటిన్నీ తన ఆధీనంలోకి తీసుకుంటాడని గూగుల్‌ ప్రాజెక్ట్‌ జీరో రీసెర్చర్‌ ట్రావిస్‌ ఓర్‌మాండీ చెప్పారు. కాగా, ఈ బగ్‌పై ఫేస్‌బుక్‌ ఇంకా స్పందించలేదు. గతేడాది నుంచి ఫేస్‌బుక్‌ సెక్యురిటీ సంబంధిత సమస్యలతో బాధపడుతూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితమే దాదాపు 5 కోట్ల యూజర్‌ అకౌంట్లు హ్యాక్‌ అయినట్టు ఫేస్‌బుక్‌ ప్రకటించి, అందర్ని షాక్‌కు గురిచేసింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌ కూడా ఫేస్‌బుక్‌ను అతలాకుతలం చేసింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండ్‌లో సుమారు 8.7 కోట్ల యూజర్లు డేటా చోరికి గురైంది.   

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)