amp pages | Sakshi

భారీగా ఫేస్‌బుక్‌ షేర్ల విక్రయం: ఎవరు?ఎందుకు?

Published on Sat, 03/03/2018 - 17:37

ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భారీ ఎత్తున షేర్లను విక్రయించారు. ఫేస్‌బుక్‌లోని సుమారు 500 మిలియన్‌ డాలర్ల విలువైన (రూ. 31,443 కోట్ల) షేర్లను అమ్మేశారు. డిసెంబర్ 2015లో తన భార్య ప్రిన్సిల్లా చాన్‌ ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌  చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్(సీజెడ్‌ఐ) కు విరాళాలు అందించే నిమిత్తం జుకర్‌ బర్గ్‌  ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాయిటర్స్ లెక్కల ప్రకారం జుకర్‌బర్గ్ ఫిబ్రవరి చివరి మూడు రోజుల్లో 125.4 మిలియన్‌ డాలర్ల విలువైన 685,000 షేర్లను విక్రయించారు. దీంతో మొత్తం ఫిబ్రవరిలో 482.2 మిలియన్ డాలర్ల విలువైన 2.7 మిలియన్ షేర్లను ఆయన విక్రయించినట్టుగా గురువారం నాటి సెక్యూరిటీ ఫైలింగ్‌ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ నిధుల ద్వారా రాబోయే సంవత్సరాల్లో ఫౌండేషన్‌ నిర్వహించే అనేక దాతృత్వ, స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చించనున్నామని సీజెడ్‌ఐ ప్రతినిధి చెప్పారు. కాగా రాబోయే 18 నెలలో దాదాపు 35 నుంచి 75 మిలియన్ ఫేస్‌బుక్ షేర్లను విక్రయించనున్నట్టు గత సంవత్సరం సెప్టెంబర్‌లోనే జుకర్‌బర్గ్ ప్రకటించిన సంగతి విదితమే. అంతే కాదు... 99 శాతం (44 బిలియన్‌ డాలర్లు) ఫేస్‌బుక్ షేర్లను కూడా అమ్మేసి ఈ సంస్థ కోసం కేటాయించనున్నట్లు మార్క్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ , అతని భార్య మెలిండా గేట్స్ , బిలియనీర్ వారెన్ బఫెట్‌ స్థాపించిన బఫెట్ ఫౌండేషన్ లాంటివాటికి సమానమైనది జకర్‌బర్గ్‌ ఫౌండేషన్ కూడా.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)