amp pages | Sakshi

షావోమి స్మార్ట్‌ఫోన్లకు ఇక అది ఉండదు

Published on Thu, 12/21/2017 - 20:20

షావోమి స్మార్ట్‌ఫోన్లకు 'నోట్‌' ట్యాగ్‌ చాలా ఫేమస్‌. రెడ్‌మి నోట్‌, రెడ్‌మి నోట్‌ 2, రెడ్‌మి నోట్‌ 3, రెడ్‌మి నోట్‌ 4 ఇలా పలు స్మార్ట్‌ఫోన్లను షావోమి మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే తాజాగా స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగిస్తున్న ఈ 'నోట్‌' ట్యాగ్‌ను షావోమి తీసివేయాలని చూస్తుందట. షావోమి 'నోట్‌' పేరుకు స్వస్తి చెప్పబోతుందంటూ ఇప్పటికే పలు రిపోర్టులు కూడా విడుదలయ్యాయి. అంతేకాక రెడ్‌మి నోట్‌4కు సక్ససర్‌గా షావోమి రెడ్‌మి 5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడం ఈ రిపోర్టులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎంఐ ఫోరమ్‌ 'సూపర్‌ మోడరేటర్‌' మిచ్‌002  ఈ విషయాన్ని తొలిసారి రివీల్‌ చేసింది. కానీ ఇప్పటి వరకు షావోమి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రెడ్‌మి 5 ప్లస్‌తో పాటు రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ను కూడా షావోమి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు హ్యాండ్‌సెట్లు ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, రెండు స్టోరేజ్‌ ఆప్షన్లను కలిగి ఉన్నాయి.  త్వరలోనే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లోకి కూడా రాబోతున్నాయి. 
 

రెడ్‌మి 5 ప్లస్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

రెడ్‌మి 5 ఫీచర్లు
2జీబీ ర్యామ్‌, 16జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ వెర్షన్‌
5.7 అంగుళాల ఫుల్‌హెచ్డీ ప్లస్‌ స్క్రీన్‌
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)