amp pages | Sakshi

పాత ఫోన్‌ ఇవ్వండి.. కొత్త ఫోన్‌ తీసుకోండి

Published on Fri, 03/16/2018 - 13:37

ముంబై : షావోమి 2017 నవంబర్‌లో  ప్రారంభించించిన ట్రేడ్‌ ఇన్‌ కార్యక్రమాన్ని ఇక మీదట తన వెబ్‌సైట్‌ ఎంఐ.కామ్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా షావోమి తన వినియోగదారులకు ఇన్‌స్టాంట్‌ ఎక్స్చేంజ్‌ కూపన్లను అందిస్తోంది. ఈ కూపన్లతో వినియోగదారులు పాత స్మార్ట్‌ ఫోన్లను ఇచ్చి, కొత్త ఫోన్లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కాషీఫై భాగస్వామ్యంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని తొలుత అన్ని షావోమీ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టోర్లకే పరిమితమైన ఈ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ని షావోమి తన వెబ్‌సైట్‌ ఎంఐ.కామ్‌లోకి కూడా విస్తరించింది.

ఎంఐ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను పొందడానికి, ఎంఐ.కామ్‌లో దానికి కేటాయించిన ప్రత్యేక పేజీలోకి వెళ్లాలి. అ‍క్కడ ఎక్స్చేంజ్‌ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి. షావోమి మీ ఫోన్‌ కండీషన్‌, ప్రస్తుతం మార్కెట్లో దాని విలువను బట్టి మీకు ఉత్తమ ఎక్స్చేంజ్‌ ధరను సూచిస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్‌ ధర నచ్చితే మీ ఫోన్‌ ఐఎమ్‌ఈఐ నంబర్‌ సహాయంతో ఎక్స్చేంజ్‌ వాల్యూ కూపన్ని పొందవచ్చు. ఈ నగదు మీ ఎమ్‌ఐ అకౌంట్‌కి జమ అవుతుంది. ఆ ఎక్స్చేంజ్‌ కూపన్‌ సహాయంతో మీరు మీకు నచ్చిన కొత్త షావోమి ఫోన్‌ను తీసుకోవచ్చు.

ఎక్స్చేంజ్‌లో ఫోన్‌ కొనాలంటే కచ్చితంగా మీ పాత ఫోన్‌ పనిచేస్తూ ఉండి, ఎటువంటి ఫిజికల్‌ డ్యామేజ్‌ లేకుండా ఉండాలనే నిబంధనను పెట్టింది కంపెనీ. మీ పాత ఫోన్‌ స్ర్కీన్‌లాక్‌ను తీసేసి, మిగతా సీక్రేట్‌ లాక్స్‌ ఏమైనా ఉంటే వాటిని కూడా అన్‌లాక్‌ చేసి ఇవ్వాలని పేర్కొంది. షావోమి లిస్ట్‌లో ఉన్న ఫోన్లకే ఈ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. వినియోగదారుడు ఒక‍్కసారి ఒక్క ఫోన్‌ను మాత్రమే ఎక్స్చేంజ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్చేంజ్‌ కూపన్‌ వాలిడిటి కేవలం 14 రోజులు మాత్రమే. ఈ ఆఫర్‌ కేవలం స్మార్ట్‌ఫోన్లకే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)