amp pages | Sakshi

‘కోడెల కాటు’ బాధితులెందరో!

Published on Sat, 07/13/2019 - 12:09

సాక్షి, గుంటూరు: ప్రతి పనికీ ఓ రేటు కట్టి కే–ట్యాక్స్‌ పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. అధికారం అండతో ఆ కుటుంబం సాగించిన దుర్మార్గాలు, దౌర్జన్యాలను ఎదురించే పరిస్థితి లేక అప్పట్లో వారంతా మిన్నకుండిపోయారు. వారిలో కొందరు ఇన్నాళ్లకు ధైర్యం చేసి పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు. తాము మోసపోయిన విషయాన్ని ధైర్యంగా చెప్పకోలేని బాధితులు ఇంకా అనేకమంది ఉన్నారు.

సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేతిలో దోపిడీకి గురైన పలువురు పోలీస్‌ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ల్యాండ్‌ కన్వర్షన్ల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కొందరు, అపార్టుమెంట్‌ నిర్మాణాల సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఇంకొందరు బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

ఇప్పటివరకూ 18 కేసులు
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై ఇప్పటివరకూ 18 కేసులు నమోదయ్యాయి. విద్యుత్‌ సబ్‌స్టేషన్, రైల్వే, మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమ నుంచి సొమ్ములు తీసుకున్నారని నిరుద్యోగులు, తమ పొలాలు, భూములను కబ్జా చేశారని రైతులు, భూ యజమానులు, తమ నుంచి కే–ట్యాక్స్‌లు వసూలు చేశారని బిల్డర్లు, మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు కోడెల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేశారు. 

కోడెల కుమారుడి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ నరసరావుపేటకు చెందిన కేబుల్‌ ఆపరేటర్‌ ఎనుగంటి వెంకట కృష్ణారావు పోలీసులను ఆశ్రయించారంటే ఆ కుటుంబం అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసి కోడెల కుటుంబం అరాచకాలపై విచారణ జరిపిస్తే మరికొందరు బాధితులు బయటకు వస్తారని చెబుతున్నారు. సత్తెనపల్లిలో నమోదైన ఓ కేసులో బాధితుడి నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి రాజీ చేసుకోగా.. ఇంకా 17 కేసులు ఆ కుటుంబంపై ఉన్నాయి. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)