amp pages | Sakshi

లవర్‌ తిట్టిందని ఆటోలోనే..

Published on Tue, 02/05/2019 - 11:33

సాక్షి, న్యూఢిల్లీ : ప్రియురాలితో ఫోన్‌లో గొడవపడి ప్రయాణిస్తున్న ఆటోలోనే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు ఓ 24 ఏళ్ల యువకుడు. అతనితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రసుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి ఉత్తర ఢిల్లీలోని ఘాజియాబాద్‌కు చెందిన శివమ్(24), దగ్గరి బంధువైన అర్జున్‌తో కలిసి ఆటోలో తమ సోదరుడి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో భగవాన్‌ సింగ్(60) అనే మరో వ్యక్తి ఆటో ఎక్కాడు.
 
ఆటోలో ప్రయాణిస్తున్న శివమ్‌, కోల్‌కతాలో ఉన్న తన ప్రియురాలికి ఫోన్‌ చేశాడు. ఆమెతో మాట్లాడుతూ.. ఇద్దరు గొడవ పడ్డారు. మనస్థాపం చెందిన శివమ్‌ వెంటనే తన బ్యాగులో ఉన్న పెట్రోల్‌ బాటిల్‌ను తీసి ఒంటిపై పోసుకొని లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. దీంతో ఆటోలో ఉన్న మరో ఇద్దరికి కూడా ఆ మంటలు తాకాయి. అప్రమత్తమైన ఆటో డ్రైవర్‌ ఆటో నిలిపి బయటకు దూకాడు. మంటలు ఆర్పి స్థానికుల సహాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగ శివమ్‌ శరీరం 70 శాతం మేర కాలిపోయిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. శివమ్‌పై ఆత్మహత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)