amp pages | Sakshi

ప్రముఖ నటుడిపై రేప్‌ కేస్‌ నమోదు

Published on Wed, 11/21/2018 - 13:00

మీటూ ఉద్యమం’లో భాగంగా సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్‌ నాథ్‌.. తనపై అత్యాచారం చేశాడంటూ నిర్మాత వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం గురించి పెద్ద వివాదమే చేలరేగింది. అలోక్‌ నాథ్‌ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇలాంటి సమయం​లో అలోక్‌ నాథ్‌కి మరో భారీ షాక్‌ తగిలింది. నిర్మాత వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్‌ నాథ్‌పై రేప్‌ కేస్‌ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఓషివారాకు చెందిన పోలీసులు అలోక్‌ మీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు.

అయితే అలోక్‌ నాథ్‌కు వ్యతిరేకంగా వింటా నందా మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ అతని భార్య గతంలో సెషన్‌ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది. వింటా నందా ఆరోపణల తర్వాత, పలువురు మహిళలు అలోక్‌ తమను కూడా లైంగికంగా వేధించాడంటూ ఆరోపించారు. దాంతో అలోక్‌ నాథ్‌ వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశాడు. లిఖితపూర్వక క్షమాపణతోపాటు పరిహారంగా రూ.1 ఇవ్వాలని గతంలో అలోక్ డిమాండ్ చేశాడు. అలోక్‌ నాథ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సీఐఎన్‌టీఏఏ(సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం) అతన్ని అసోసియేషన్ నుంచి బహిష్కరించింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై కూడా అలోక్‌ స్పందించలేదు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌