amp pages | Sakshi

గన్‌ మిస్‌ ఫైర్‌.. తప్పిన పెను ప్రమాదం

Published on Mon, 06/08/2020 - 12:18

నిర్మల్‌టౌన్‌: కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ శంకర్‌గౌడ్‌ చేతిలో ఉన్న తుపాకి మిస్‌ఫైర్‌ అయి ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శంకర్‌గౌడ్‌ గార్డుగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం తన తుపాకిని శుభ్రం చేస్తుండగా, అనుకోకుండా ట్రిగ్గర్‌కు వేలు తగిలి తుపాకి పేలింది. దీంతో శంకర్‌గౌడ్‌ ఎడమభాగంలోని ఛాతి, భుజం భాగం ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్‌ బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది. బుల్లెట్‌ శరీరంలోకి దూసుకెళ్తే ప్రాణానికి ప్రమాదం సంభవించే అవకాశం ఉండేది.  వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి శంకర్‌గౌడ్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)