amp pages | Sakshi

పెళ్లి వేడుకలో రష్యన్‌ యువతులతో..

Published on Tue, 07/24/2018 - 11:25

హైదరాబాద్,చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో కొందరు పాశ్చాత్య సంస్కృతికి శ్రీకారం చుట్టారు. పెళ్లి వేడుకలకు ఏకంగా రష్యన్‌ యువతులను రప్పించి బెల్లి డ్యాన్స్‌లు చేయించారు. ఆట పాటలతో హోరెత్తిస్తుండడంతో అసౌకర్యానికి గురైన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. యువతులను మాత్రం చాకచక్యంగా అక్కడినుంచి తప్పించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడలోని నూరీ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం రాత్రి బార్కాస్‌ ప్రాంతానికి చెందిన బహమాద్‌ వంశస్తుల వివాహం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎనిమిది మంది రష్యన్‌ యువతులను రప్పించి బెల్లి డ్యాన్స్‌లు చేయించారు. వారిపై నోట్లు విసురుతూ నానా రభసా చేయడంతో అసౌకర్యానికి గురైన స్థానికులు డయల్‌–100కు సమాచారం అందించారు.

చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా నిర్వాహకులు సదరు యువతులను అక్కడి నుంచి తప్పించారు. పోలీసులు పెళ్లి కుమారుడు యాహ్యా బా అహ్మద్, అతని సోదరుడు అబ్దుల్‌ బా అహ్మద్, ఫంక్షన్‌హాల్‌ యజమాని ఈసా మిశ్రీ, మేనేజర్‌ తాహెర్‌ షా, ఆర్కెస్ట్రా నిర్వాహకుడు మహ్మద్‌ వసీం, అబ్దుల్లా అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు.   

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌