amp pages | Sakshi

ట్రాప్‌.. రేప్‌

Published on Sat, 07/14/2018 - 12:26

విజయవాడలో పోకిరీ మూకల ఆగడాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అమాయకులైన ఆడపిల్లలను నమ్మించి వంచనకు గురిచేస్తున్నారు. అసభ్య వీడియోలు తీసి వేధిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారి అరాచకాలకు పాల్పడుతున్నారు. మత్తులో కూరుకుపోయిన కొందరు యువకులు శివారు ప్రాంతాల్లోని విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్నారు. దీంతో విద్యార్థినులు చిత్రవధ అనుభవిస్తున్నారు. శివారులోని రెండు పోలీసుస్టేషన్ల పరిధిలో ఆగడాలు తీవ్రంగా ఉన్నాయి.

సాక్షి, అమరావతిబ్యూరో : రాజధానిలో ఆకతాయి గ్యాంగ్‌ల విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేసే వారు కరువయ్యారు. కాలేజీ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని పోకిరీ గ్యాంగ్‌లు పెట్రేగిపోతున్నాయి.  పథకం ప్రకారం విద్యార్థినులను ట్రాప్‌ చేస్తున్నారు. ఆ పోకిరీ మూకలో ఒకరు యువతిని ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి నమ్మిస్తారు.  ఆ యువతిని అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్లి అసభ్యంగా వీడియోలు తీస్తున్నారు. తమ మాట వినకపోతే సోషల్‌మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధింపుల పరంపర కొనసాగిస్తున్నారు. ఇంట్లో చెప్పలేక వారి వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది యువతులు బాధితులుగా మారుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసి నిలదీస్తున్న కుటుంబసభ్యులపై  దాడులకు సైతం తెగబడుతున్నారు. ఇదేదో ఎప్పుడో ఎక్కడో ఓసారి జరుగుతున్న దారుణం కాదు... విజయవాడ పరిసరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న విషపు వల. ఇక యువతులను టీజింగ్, ఇతర వేధింపులకు అయితే అడ్డూ అదుపూ లేకుండాపోయింది. కాలనీలు, శివారు ప్రాంతాల్లో తిష్టవేసిన పోకిరీలు ఆగడాలకు యువతులు హడలెత్తుతున్నారు.

ఆ రెండు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనేఅత్యధికంగా...
ప్రధానంగా కమిషరేట్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ... ఆ సమీపంలోని జిల్లా ఎస్పీ పరిధిలోకి వచ్చే మరో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పరిస్థితి తీవ్రత ఎక్కువుగా ఉంది. ఆ రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే ఎక్కువుగా కాలేజీలు ఉన్నాయి. శివారులో ఉండటంతోపాటు ఎక్కువగా జనసంచారం లేని ఆ ప్రాంతాలను ఆకతాయిలు తమ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేసుకుంటున్నారు. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక కొందరు ధైర్యం చేసి కుటుంబసభ్యులకు విషయాన్ని చెబుతున్నారు. వారిలో చాలా కొద్దిమంది తల్లిదండ్రులే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ రెండు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో లెక్కకు మించి ఫిర్యాదులు నమోదు అవుతుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణం స్పందిస్తూనే ఉన్నారు. యువతులకు సంబంధించిన వ్యవహారం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా కేసులను డీల్‌ చేస్తున్నారు. చాలావరకు కేసుల్లో పోకిరీలను   తీసుకువచ్చి ‘తమదైన శైలిలో’ బుద్ధి చెప్పి పంపిస్తున్నారు. అయినప్పటికీ ఆకతాయిల ఆగడాలు పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. ఆ రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలో కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.

డ్రగ్స్‌ మహమ్మారి కూడా...
పోకిరీల విశృంఖలత్వానికి డ్రగ్స్‌ మరింత కిక్‌ ఇస్తున్నాయి. శివారులో ప్రాంతాలు డ్రగ్స్‌ రాకెట్‌కు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. గంజాయితోపాటు మరికొన్ని డ్రగ్స్‌ విక్రయం జోరుగా సాగుతోంది. సీఆర్‌డీఏ ప్రాంతంలో కొన్ని గ్రామాలు కేంద్రంగా ఈ డ్రగ్స్‌ దందా సాగుతోంది. అక్కడ నుంచి శివారుప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. ఆకతాయి మూకలు వారంతపు రోజుల్లో ప్రత్యేకంగా డ్రగ్స్‌  పార్టీలు పెట్టుకుని మరీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకూంటూ భీతావాహ పరిస్థితులు సృష్టిస్తున్నారు. తీవ్ర గాయాలతో  శివారులోని ఆసుపత్రుల్లో చేరుతున్నారు కూడా. వారు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు రక్త పరీక్షల్లో వెల్లడవుతోందని ఆసుపత్రివర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతపై పోలీసులు దృష్టి సారించారు. పెడదారి పడుతున్న యువతను కట్టడిచేసే విషయంపై కమ్యూనిటీ పోలీసింగ్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. త్వరలోనే కార్యాచరణను చేపట్టనున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)