amp pages | Sakshi

పక్కా ప్రణాళికతోనే హత్య

Published on Mon, 01/22/2018 - 10:48

పోలవరం రూరల్‌: పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట గ్రామానికి చెందిన ఇళ్ల సావిత్రి, ఆమె కుమార్తె పులిబోయిన మంగతాయారును పథకం ప్రకారమే వారి భర్తలు హతమార్చారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో విషయం బయటపడింది. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. వీరిని ఆదివారం జడ్జి ఎదుట హాజరుపరిచారు. పోలవరం పోలీస్‌స్టేషన్‌ వద్ద డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. తల్లీకూతుళ్లు సావిత్రి, మంగతాయారును వారి భర్తలు ఇళ్ల రామాంజనేయులు, పులిబోయిన నా గరాజు హత్య చేసినట్టు చెప్పారు. ముందుగా వీరు వేసుకున్న పథకం ప్రకారం హతమార్చారు.

గతేడాది నవంబర్‌ 8న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు కనిపించడం లేదని సావిత్రి తల్లి కొండా గంగమ్మ పోలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో సావిత్రి భర్త రామాంజనేయులపై వరకట్న వేధింపుల కేసు ఉంది. దీంతె రా మాంజనేయులు విడిగా ఉంటున్నాడు. పు లిబోయిన నాగరాజు భార్య మంగతాయారుపై అనుమానం పెంచుకుని అతడూ విడిగా ఉంటున్నాడు. ఈనేపథ్యంలో తల్లీకూతుళ్లు ఎల్‌ఎన్‌డీ పేటలో నివసిస్తున్నారు. కుమార్తె మంగతాయారును కాపురానికి తీసుకువెళ్లాలని నాగరాజు వద్ద సావిత్రి పట్టుబట్టింది.  దీంతో ఎలాగైనా తల్లీకూతుళ్లను అంతమొందించాలని మామాఅల్లుళ్లు నిర్ణయించుకున్నారు.

ఈనేపథ్యంలో పక్కాగా ప్రణాళిక రచించారు. నాగరాజు భార్యను కాపురానికి తీసుకువెళతానని నమ్మించాడు. బుట్టాయగూడెం మండలం కేఆర్‌ పురం ఐటీడీఏ సమీపంలోని జీడిమామిడి తోటలో మామాఅల్లుళ్లు గొయ్యి తీసి సిద్ధం చేశారు. ఇల్లు చూశాను, మీరు చూస్తే కాపురం మొదలుపెడతామని అదేరోజు నాగరాజు తల్లీకూతుళ్లను నమ్మించి కన్నాపురం రమ్మన్నాడు. ముందుగా నాగరాజు భార్యను మోటార్‌సైకిల్‌పై మామిడితోటలోకి తీసుకువెళ్లగా అక్కడే పొదల మధ్య పొంచి ఉన్న ఆంజనేయులు మెడలో నైలాన్‌ తాడు వేసి బిగించి ఆమెను హతమార్చాడు. సమీపంలో తీసిన గోతిలో మృతదేహాన్ని పడేశాడు. తర్వాత నాగరాజు అత్త సావిత్రిని మోటార్‌సైకిల్‌పై తీసుకువచ్చాడు. ఆమెనూ హతమార్చి అదే గోతిలో వేసి పూడ్చి వీరిద్దరూ పరారయ్యారు. నాగరాజు, రామాంజనేయులను పూర్తిగా విచారించగా అసలు విషయం బయటపడిందని డీఎస్పీ పేర్కొన్నారు. సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై కె.శ్రీహరిరావు ఉన్నారు.

Videos

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?