amp pages | Sakshi

‘కథువా’ కేసు; సంచలన ఆధారాలు

Published on Sat, 04/21/2018 - 10:30

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలిచివేసిన కథువా బాలిక హత్యాచారానికి సంబంధించి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. చిన్నారి శరీర భాగాలు, దుస్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, నిందితుల డీఎన్‌ఏతో సరితూగాయని ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌(డీఎఫ్‌ఎల్‌) నివేదికలో వెల్లడైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొంది. దీంతో చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైందని, కోర్టు విచారణలోనూ ఇవే అంశాలు కీలకం కానున్నాయని సిట్‌ అధికారులు అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌ 28న జరగనుంది.

చిన్నారిపై అకృత్యం జరిగింది ఆలయంలోనే!: కథువా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన వేళ ఘటన జరిగిన ప్రదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘జరిగింది ఆలయంలో కాదంటూ’ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంకూడా సాగింది. అయితే ప్రాధమిక దశలోనే ఆలయం నుంచి సేకరించిన రక్తనమూనాలు, వెంట్రుకలు.. ఇటీవల అరెస్టైన నిందితుల డీఎన్‌ఏతో సరితూగాయని ఫోనెన్సిక్‌ నివేదికలో తేలింది.

హత్య తర్వాత దుస్తులు ఉతికారు!: రోజుల పాటు చిన్నారికి నరకం చూపించి, హత్యచేసిన తర్వాత సంబంధిత ఆధారాలను చెరిపేసేందుకు నిందితులు యత్నించారు. ‘హత్య తర్వాత బాధితురాలి దుస్తులు ఉతికారు, తల నుంచి పాదాల దాకా తుడిచేశారు. దీంతో ఆధారాలను నిర్ధారించడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆలయంలో లభించిన రక్తనమూనాలు, వెంటుక్రలు ఎవరివనేవి తేల్చలేకపోయాం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ (డీఎఫ్‌ఎల్‌) సహాయాన్ని తీసుకున్నాం. అత్యాధునిక విశ్లేషణా పద్ధతులను అవలంబించే డీఎఫ్‌ఎల్‌.. మృతురాలి శరీరభాగాలు, ఒంటిపై లభించిన రక్తపు నమూనాలను విశ్లేషించి, వాటిని నిందితుల డీఎన్‌ఏతో సరిపోల్చగా దాదాపు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లైంది’’ అని సిట్‌ అధికారులు పేర్కొన్నారు. కథువా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా నిరసనలు జరిగాయి.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?