amp pages | Sakshi

ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తా!

Published on Thu, 04/18/2019 - 09:55

తమిళనాడు, టీ.నగర్‌: ప్రేమించలేదన్న ఆగ్రహంతో ముఖంపై యాసిడ్‌ పోస్తానని కళాశాల విద్యార్థినిని బెదిరించిన యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై రాయపురానికి చెందిన 19 ఏళ్ల యువతి. గతంలో ఆమె కేకేనగర్‌లో నివశిస్తుండగా అదే ప్రాంతానికి చెందిన మెకానిక్‌ వీరపాండి (23) ఆమెను ప్రేమిస్తూ వచ్చినట్లు సమాచారం. పరిచయమైన కొద్ది రోజులకే అతని ప్రవర్తనపై విసిగిన యువతి వీరపాండితో మాట్లాడడం మానేసింది.

దీంతో సదరు యువతి ఇల్లు మార్చుకుని రాయపురానికి చేరుకుంది. ఇలావుండగా యువతి కళాశాలకు వెళుతున్నట్లు తెలుసుకున్న అతను అక్కడికి వెళ్లి ఆమెను ప్రేమించాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. అతని వేధింపులు తాళలేఖ యువతి హెచ్చరించి పంపేసింది. ఇలావుండగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో యువతి ఒంటరిగా ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లిన వీరపాండి ఆమెతో తనను ప్రేమించాలని, లేకుంటే యాసిడ్‌ ముఖం మీద పోస్తానని బెదిరించి వెళ్లాడు. దీంతో యువతి తన తల్లిదండ్రులతో రాయలనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు  వీరపాండిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో అతను యాసిడ్‌ దాడి చేస్తానని బెదిరించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి జైలులో నిర్బంధించారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?