amp pages | Sakshi

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

Published on Tue, 11/06/2018 - 11:36

చిత్తూరు , తంబళ్లపల్లె : తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ఇంటిలోనే చంపేసింది. ప్రియుడి సహకారంతో పాతిపెట్టింది. భర్త అదృశ్యమయ్యాడని నాటకం ఆడింది. ఐదు నెలల తర్వాత పోలీసులు మిస్టరీని ఛేదించారు. ములకలచెరువు సీఐ శ్రీనివాసులు సోమవారం ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తంబళ్లపల్లె మండలం కోట కొండ పంచాయతీ ఎగువతండాకు చెందిన రమణమ్మ(45)కు, అదే పంచాయ తీ బందార్లపల్లెకు చెందిన మదన్‌మోహన్‌రెడ్డితో 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. రమణమ్మ భర్త బుక్యామారూనాయక్‌ (60) ఈ విషయమై మందలించేవాడు. దీంతో విసుగు చెందిన రమణమ్మ భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే నెల 25వ తేదీన ఇంటిలోనే మద్యం తాగుతున్న భర్తతో గొడవపడింది. ఓ పథకం ప్రకారం ఇంటిలో ఉన్న గడువు తీరిన పలురకాల మాత్రలను పొడి చేసి మద్యంలో కలిపి భర్తకు తాగించింది. అత ను అపస్మారక స్థితిలోకి చేరుకోగానే చంపేసింది. ఈ విషయాన్ని ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందించింది. అదేవిధంగా కోసువారిపల్లె పంచా యతీ చిన్నప్పరెడ్డిగారిపల్లెకు చెందిన సుబ్బారెడ్డికి ఎగువతండాలోని మరో మహిళతో వివాహేతర సంబంధం కల్పిం చేందుకు రమణమ్మ సహకరించింది.

దీం తో రమణమ్మ అతని సహకారం కోరింది. ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి ఇద్దరూ తండాకు చేరుకుని అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని సంచిలో మూట కట్టి ట్రాక్టర్‌లో తీసుకెళ్లి రేణిమాకులపల్లె పంచాయతీ జోగువానిబురుజు సమీపంలోని ఈదలవంక వాగులో పాతిపెట్టారు. అదే నెల 29వ తేదీ రమణమ్మ, కుమారు డు హరినాయక్‌తో కలిసి మారూనాయక్‌ అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానితులను విచారించినా ప్రయోజనం లేదు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ శివకుమార్‌ ప్రత్యేక నిఘా పెట్టారు. ఫోన్‌కాల్స్‌ ద్వారా నిందితులను గుర్తించి అదృశ్యమైన వ్యక్తిని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రమణమ్మ పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఆదివారం ఆర్‌ఐ బాలాజీ వద్ద లొంగిపోయింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఆదివారం సాయంత్రం తంబళ్లపల్లె గ్యాస్‌ గోడౌన్‌ వద్ద ఉన్న మదన్‌మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డిని అరెస్ట్‌ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. మారూనాయక్‌ మృతదే హానికి సంఘటన స్థలంలోనే తహసీల్దార్‌ సురేష్‌బాబు సమక్షంలో సోమవా రం మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులు రామచంద్రప్రసాద్‌రావు పోస్టుమార్టం చేశారు. నిందితుల కాల్‌ డేటా సేకరించేందుకు చేసిన కృషి చేసిన ఐడీ పార్టీ పోలీసులు వెంకటేష్, సిరాజ్, శ్రీకాంత్‌ను అభినందించి నగదు రివార్డు అందజేశారు. ములకలచెరువు ఎస్‌ఐ ఈశ్వరయ్య, పెద్దతిప్పసముద్రం ఎస్‌ఐ రవికుమార్‌ ఉన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)