amp pages | Sakshi

బంధువే సూత్రధారి..!

Published on Fri, 11/08/2019 - 08:06

సాక్షి, మిర్యాలగూడ టౌన్‌ : మిర్యాలగూడ మండలం కిష్టాపురం ఎక్స్‌ రోడ్డు వద్ద గత నెల 17వ తేదీన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సమీప బంధువే సూత్రధారిగా వ్యవహరించి కిరాయి వ్యక్తులతో ఘాతుకానికి ఒడిగట్టినట్టు విచారణలో వెల్లడైంది. ఈ హత్య కేసులో సూత్రధారితో పాటు మరో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా మరో ఐదుగురు  పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గురువారం స్థానిక రూరల్‌ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన  సమావేశంలో డీఎస్పీ వై. వెంకటేశ్వర్‌రావు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.

మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మల్‌రెడ్డి శివారెడ్డి కుటుంబానికి సమీప బంధువు అయిన మోర్తాల పద్మ, ఆమె భర్త సీతారాంరెడ్డి కుటుంబానికి 20 ఏళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఆ వివాదం కోర్టులో నడుస్తుండగా మోర్తాల పద్మ పేరుతో కిష్టాపురం గ్రామ శివారులో గల భూమిని కొన్నేళ్ల క్రితం కోర్టు ద్వారా శివారెడ్డి కుటుంబం స్వాధీనం చేసుకున్నారు. కక్ష పెంచుకుని.. రూ. లక్షలు విలువ చేసే రెండెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని సీతారాంరెడ్డి కుటుంబం శివారెడ్డి కుటుంబంపై కక్ష పెంచుకుంది.

శివారెడ్డి అడ్డు తొలగించుకుంటే భూమిని స్వాధీనం చేసుకోవచ్చనే దురుద్దేశంతో సీతారాంరెడ్డి పథకం రచించాడు. అందుకు తన స్నేహితుడైన ఇజ్రాయిల్‌ను ఆశ్రయించాడు. అతను అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన కలకొండ సత్యం అనే వ్యక్తిని పరిచయం చేశాడు.  వీరు ముగ్గురు కలిసి పథకం వేసి కలకొండ సత్యం ద్వారా కిరాయి వ్యక్తులకు రూ. 3.6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత అక్టోబర్‌ 17వ తేదీన కిరాయి వ్యక్తులు కొత్తపల్లి కళ్యాణ్, గుంజ వెంకన్న, వీర్ల మల్లేశ్‌ బైక్‌లపై వచ్చి శివారెడ్డిని కత్తి, గొడ్డలితో దారుణంగా హత్య చేశారు. 

పట్టుబడ్డారు ఇలా..
శివారెడ్డిని హత్య చేసిన అనంతరం కొత్తపల్లి కళ్యాణ్, గుంజ వెంకన్న, వీర్ల మల్లేశ్‌లు పట్టణంలోని ఈదులగూడ చౌరస్తాలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు. ఒప్పందం ప్రకారం రూ.3.6 లక్షలు ఇవ్వాలని సీతారాంరెడ్డికి ఫోన్‌ చేశారు. అయితే అప్పటికే శివారెడ్డి కుటుంబం సీతారాంరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. వెంటనే సీతారాంరెడ్డి కదలికలపై నిఘా పెట్టడంతో సుపారీ ఇచ్చేందుకు వెళ్లగా హత్య చేసిన ముగ్గురితో పాటు సీతారాంరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో పాత్రదారులుగా వ్యవహరించిన మరో ముగ్గురిని అరెస్ట్‌ చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ వివరించారు.

నిందితులు వీరే 
మల్‌రెడ్డి శివారెడ్డి హత్య కేసులో మిర్యాలగూడ పట్టణం విద్యానగర్‌కు చెందిన దుర్గంపూడి సీతారాంరెడ్డి, అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన కలకొండ సత్యం, హౌసింగ్‌బోర్డుకు చెందిన కొత్త కళ్యాణ్, డిండి మండలం బొగ్గుల దొన((పస్తుతం మిర్యాలగూడలోని హౌసింగ్‌బోర్డు)కు చెందిన గుంజ వెంకన్న, మిర్యాలగూడ మండలం అవంతిపురానికి చెందిన వీర్ల మల్లేష్,  కడియం గురువయ్య అలియాస్‌ ఇజ్రాయిల్, విద్యానగర్‌కు చెందిన మోర్తాల పద్మ, మిర్యాలగూడ మండలం అవంతిపురానికి చెందిన మాక్టింగ్‌ డ్రైవర్‌ చనిమోల్ల మహేశ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

త్రిపురారం మండలం రాగడప గ్రామానికి చెందిన అద్దంకి దుర్గా ప్రసాద్, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడేనికి చెందిన గట్టిగొర్ల లింగయ్య, మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన  వల్లపు బాలా మల్లు, మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన బచ్చలకూరి నరేష్, మాటూరు గ్రామానికి చెందిన దనావత్‌ నాగు పరారీలో ఉన్నట్లు డీఎస్‌పీ తెలిపారు. వీరి నుంచి కత్తి, గొడ్డలితో బైక్, కారు, రూ.3.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో మిర్యాలగూడ రూరల్‌ సీఐ రమేష్‌బాబు తదితరులున్నారు.  

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)