amp pages | Sakshi

కార్డు నంబర్ తో పాటు ఓటీపీ కూడా చెప్పేసింది

Published on Tue, 12/26/2017 - 10:55

సాక్షి, సిటీబ్యూరో: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వివరాలు ఆప్‌లోడ్‌ చేస్తానంటూ సమాచారం సేకరించి లక్షకుపైగా ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేసిన జార్ఖండ్‌ రాష్ట్ర జాంతార్‌ జిల్లాకు చెందిన నలుగురు సైబర్‌ నేరగాళ్లను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్‌లోని జాంతార్‌లో బాబూలాల్‌ హెంబ్రోమ్, ఆశిన్‌ కిస్క్, నిభాష్‌ మోండల్, రాంమందార్‌లను పట్టుకొని ట్రాన్సింట్‌ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా తెలిపిన మేరకు.. ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌నని వచ్చిన ఫోన్‌కాల్‌ను  బాధితురాలి సోదరి రిసీవ్‌ చేసుకుంది. మీ క్రెడిట్‌ కార్డు వివరాలు ఆప్‌లోడ్‌ చేయాలని అనడంతో ఆ మాటలు నమ్మిన ఆమె క్రెడిట్‌ కార్డు నంబర్, సీవీవీ నంబర్‌తో పాటు ఆమె సెల్‌నంబర్‌కు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ)లను చెప్పేసింది. వీటితో నేరగాళ్లు లక్షకుపైగా రూపాయలతో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేశారు.

చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు, అతని సోదరుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు మొబైల్‌ ఫోన్‌లు, కాల్‌డేటా ఆధారంగా జార్ఖండ్‌లోని జాంతార్‌ జిల్లా కర్మతార్‌లో ఉన్నట్టుగా గుర్తించారు. ఎస్‌ఐలు శ్రీనివాస్, విష్ణువర్ధన్‌ నేతృత్వంలోని బృందం అక్కడికెళ్లి జాంతార్‌ పోలీసుల సహాకారంతో  బాబూలాల్‌ హెంబ్రోమ్, ఆశిన్‌ కిస్క్, నిభాష్‌ మోండల్, రాంమందార్‌లను పట్టుకున్నారు. సెల్‌ఫోన్లు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి ట్రాన్సింట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. మియాపూర్‌లోని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. బ్యాంక్‌ ప్రతినిథులమంటూ, బ్యాంక్‌ల  కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంటూ వచ్చే ఫోన్‌కాల్‌లను నమ్మవద్దని, బ్యాంక్‌ల నుంచి ఎవరూ ఎటువంటి ఫోన్‌కాల్స్‌ చేయరని, ఎవరూ అడిగినా కార్డు వివరాలు చెప్పవద్దంటూ  క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా తెలిపారు.   

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)