amp pages | Sakshi

జిల్లా క్లబ్‌పై దాడులు

Published on Tue, 09/17/2019 - 09:56

సాక్షి, మహబూబ్‌నగర్‌: జిల్లా క్లబ్‌పై పోలీసుల దాడులు జిల్లాకేంద్రంలో కలకలం రేపింది. పట్టణ నడిబొడ్డున ఉన్న జిల్లా క్లబ్‌లో డబ్బులు పందెంగా ఏర్పాటు చేసుకొని పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ డీఎస్పీ భాస్కర్, ఎస్‌బీ డీఎస్పీ గిరిబాబు, డీటీసీ డీఎస్పీ సాయిప్రసాద్, టూటౌన్‌ సీఐ శ్రీనివాసాచారి సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేయడం జరిగింది. దీంతో కాయిన్స్‌ పెట్టుకొని మూడు ముక్కలాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు బందిగ శివప్ప, ఉప్పల లక్ష్మయ్య, కేటీ సుదర్శన్, మల్లేశ్, దశరథం, మదన్‌మోహన్‌రెడ్డితోపాటు క్యాష్‌ కౌంటర్‌ మేనేజర్లను అదుపులోకి తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేశారు. అలాగే క్లబ్‌ కౌంటర్‌లో ఉన్న రూ.1,24,660 నగదు సీజ్‌ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నట్లు ముందస్తు సమాచారం తెలుసుకున్న కొందరు పెద్దలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. జిల్లా క్లబ్‌లో పేకాట ఆడటానికి కోర్టు అనుమతి ఉన్న దానికి విరుద్ధంగా ఆడుతున్నట్లు తెలుస్తోంది. 

అనుమతి తుంగలో తొక్కారు 
గతంలో జిల్లా క్లబ్‌పై పోలీసులు దాడులు చేయడంతో దీనిపై అప్పట్లో ఉన్న పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించి కొన్ని నిబంధనలతో కూడిన పేకాట ఆడుకోవచ్చని ఆర్డర్‌ తెచ్చుకున్నారు. రమ్మీ, 13 కార్డ్స్‌ మాత్రమే ఆడాలని ఇందులో కూడా టేబుల్స్‌పై నగదు ఉండరాదని చెప్పింది. దీంతో పేకాట ఆడుతున్న గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానిని నేరుగా ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేయాలని సూచించింది. దీంతో అలాంటి నిబంధనలు పాటించకుండా క్లబ్‌ కౌంటర్‌లో డబ్బులు కట్టి కాయిన్స్‌ తెచ్చుకొని పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పేకాట ఆడాలని భావించిన ప్రతి ఒక్కరు ఎన్ని వేలు అయినా కౌంటర్‌లో కట్టి దానికి ప్రతిఫలంగా కాయిన్స్‌ తీసుకోవాలి. దీంట్లో గెలుపొందిన వ్యక్తులకు కాయిన్స్‌ పరిశీలించి దాని ప్రకారం కౌంటర్‌ నిర్వాహకులు గెలుపొందిన వ్యక్తులకు నగదు చెల్లిస్తారు. 

రాత్రివేళలోనే అధికంగా.. 
జిల్లాకేంద్రంలోని జిల్లా క్లబ్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో కాయిన్స్‌ పెట్టి భారీస్థాయిలో మూడు ముక్కలాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో రాజకీయ పెద్దల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతిఒక్కరు ఉంటారని తెలుస్తోంది. ఈ దాడులు ఏదో రాత్రివేళలో చేసి ఉంటే పెద్ద మనుషులు అందరూ పట్టుబడే వాళ్లని చర్చించుకుంటున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రూ.300 నుంచి రూ.500లోపు ఆడేవారు మాత్రమే ఉంటారని సమాచారం. రూ.వేలు, లక్షలు పెట్టి ఆడేవారు సాయంత్రం 6 గంటల తర్వాతే క్లబ్‌ చేరుకుంటారని తెలుస్తోంది. పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో దాడులు చేస్తే రూ.లక్షల్లో నగదు లభ్యమవుతుందని ప్రచారం. 

కాయిన్స్‌ పెట్టి పేకాట 
జిల్లా క్లబ్‌లో నూతనంగా ఏర్పాటు అయిన గేమింగ్‌ యాక్టు ప్రకారం డబ్బులు పెట్టి లేదా వాటిస్థానంలో కాయిన్స్‌ పెట్టి పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు క్లబ్‌లో భారీస్థాయిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతుండగా దాడులు చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రూ.1,24,660 నగదు సీజ్‌ చేసినట్లు చెప్పారు. దీంతోపాటు డిస్ట్రిక్‌ క్లబ్‌లో చట్టవిరుద్ధంగా డబ్బులతో పేకాట ఆడుతున్న నేపథ్యంలో సంబంధిత కమిటీ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట కానీ ఇతర జూదం ఆడటం చట్టప్రకారం నేరమని ఇలాంటి కార్యకళాపాలు ఎక్కడ జరిగిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)