amp pages | Sakshi

ప్రియాంక హత్య; 40 నిమిషాల్లోనే ఘోరం

Published on Fri, 11/29/2019 - 20:48

సాక్షి, హైదరాబాద్‌: వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డిను పథకం ప్రకారం హత్య చేశారని తేలిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి మద్యం మత్తులో హంతకులు ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్రియాంక కదలికలను పసిగట్టి నలుగురు దుండగులు అప్పటికప్పుడు 40 నిమిషాల వ్యవధిలోనే పథకం పన్ని ఆమెను కిరాతంగా హత్య చేశారు. ప్రియాంకకు సహాయం చేస్తున్నట్టు నటించి ఆమెను నమ్మించి ఈ అఘాయ్యితానికి పాల్పడ్డారు. అమాయకంగా వారిని నమ్మిన ప్రియాంక చివరకు తన ప్రాణాలు పోగొట్టుకుంది.

కుట్రలో భాగంగా ప్రియాంక స్కూటర్‌ టైర్‌ గాలి దుండగులు తీశారు. టైర్‌ పంక్చర్‌ అయిందని, బాగు చేయించుకొస్తామని నమ్మబలికి ఆమెను ఏమార్చారు. తమ లారీని అడ్డంగా పెట్టి ఆమెను ఎత్తుకుపోయారు. టోల్‌ప్లాజాకు కూతవేటు దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి అమాయకురాలిని దారుణంగా చంపేశారు. టోల్‌ప్లాజాకు సమీపంలోనే ఇదంతా జరుగుతున్నా ఎవరు పసిగట్టలేకపోవడం బాధాకరం. పోలీసుల నిఘా వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది. హంతకులు లారీని రోడ్డు పక్కన ఆపి సాయంత్రం నుంచి రాత్రి వరకు మద్యం సేవిస్తున్నా హైవే పెట్రోలింగ్‌ పోలీసుల దృష్టికి రాకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించలేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. హంతకులు ప్రియాంక మృతదేహాన్ని తమ లారీలో 27 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి తగులబెట్టినా పోలీసులు గుర్తించలేకపోయారు. నిందితులు నలుగురిలో ముగ్గురు ఒకే వయసు వారు కావడం గమనార్హం.

ప్రియాంక దారుణ హత్య దేశంలోని అందరినీ ఎంతగానో కదిలించింది. అత్యంత క్రూరంగా అమాయకురాలి నిండు ప్రాణాన్ని బలికొన్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలని దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డిమాండ్‌ చేశారు. టోల్‌ప్లాజాకు దగ్గరలోనే, రహదారికి పక్కనే మద్యం దుకాణానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆపద సమయంలో ఉన్నవారెవరైనా తప్పకుండా 100 నంబరుకు డయల్‌ చేయాలని తెలంగాణ డీజీపీ సహా రాచకొం‍డ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు...

ప్రియాంక హత్య కేసు; ఉలిక్కిపడ్డ గుడిగండ్ల

ప్రియాంక హత్య.. గుండె పగిలింది

నమ్మించి చంపేశారు!

భయమవుతోంది పాప​.. ప్లీజ్‌ మాట్లాడు

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు  అభయ.. ఇప్పుడు !

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?