amp pages | Sakshi

దారుణం.. మహిళను పోలీస్‌ జీప్‌పై కట్టేసి..

Published on Wed, 09/26/2018 - 20:36

అమృత్‌సర్‌ : పంజాబ్‌ పోలీసులు ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఓ మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఆమెను జీపు పై భాగంలో కట్టేసి ఊరంతా తిప్పారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అమృత్‌సర్‌లోని చవిందా దేవి గ్రామానికి చెందిన బాధితురాలి మామ ఓ ఆస్తివివాదంలో నిందితుడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేయడానికి వాళ్ల ఇంటికి వెళ్లగా అతను లేడు. దీంతో వారు ఆమె భర్తను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకుంది.

ఆగ్రహానికిలోనైన క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆమెను బలవంతగా జీపు పైభాగాన్ని కట్టేసి ఊరంతా తిప్పారు. వాహనాన్ని వేగంగా పోనివ్వడంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సైతం పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ముస్లిం యువకుడిని ప్రేమించిందని ఓ యువతిని జీపులో ఎక్కించి కొడుతూ అమానుషంగా ప్రవర్తించిన వీడియో కూడా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. (చదవండి: ప్రేమ వ్యవహారం: యువతిని హింసించిన పోలీసులు)

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌