amp pages | Sakshi

సల్మాన్‌ ఖాన్‌ కేసు..10 ఆసక్తికర అంశాలు

Published on Thu, 04/05/2018 - 15:54

జోధ్‌పూర్‌: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్‌ కండల నటుడు సల్మాన్‌ ఖాన్‌ దోషిగా తేలడంతో జోథ్‌పూర్‌ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధించిన సంగతి తెల్సిందే. 1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’  మూవీ షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ కృష్ణ జింకలను వేటాడాడని ధృవీకరించుకుని కోర్టు ఈ శిక్ష విధించింది.

ఈ కేసుకు సంబంధించిన 10 ఆసక్తికర అంశాలు
1. తుది తీర్పు వెలువడే సమయంలో కోర్టుకు సల్మాన్‌ ఖాన్‌ తనకు ఇష్టమైన నల్లటి చొక్కాలో వచ్చాడు.  కోర్టు సల్మాన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ఆయన చెల్లెల్లు అల్విరా, అర్పితా కోర్టులో ఏడ్చారు.
2. సల్మాన్‌కు శిక్ష విధించిన వెంటనే జోథ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. 2006లో ఇదే జైలులో సల్మాన్‌ ఐదు రోజుల జైలు జీవితం గడిపాడు.  ఇదే జైలులో అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆశారాం బాపు కూడా ఉన్నాడు.
3. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సైఫ్‌ అలీ ఖాన్‌, సొనాలీ బెంద్రే, టబు, నీలం కొఠారీలను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. సల్మాన్‌ ఖాన్‌  జింకలను వేటాడే సమయంలో ప్రయాణించడానికి ఉపయోగించిన జిప్సీలోనే వీరు కూడా ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి.
4.  జంతువులను ఇష్టపడి ప్రేమించే బిష్ణోయ్‌ తెగ ఉండే గ్రామ సమీపంలో సల్మాన్‌ ఖాన్‌ రెండు కృష్ణ జింకలను చంపినట్లు ప్రాసిక్యూషన్‌ కోర్టులో వాదించింది.
5. మొత్తంలో బిష్ణోయ్‌ గ్రామానికి చెందిన 28 మంది ఈ కేసులో సల్మాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. తాము తుపాకీ శబ్దం విని తమ గుడిసెల్లో నుంచి పరుగెత్తుకుంటూ సంఘటనాస్థలానికి చేరుకున్నామని వారు తెలిపారు.
6.తాము బైక్‌లపై జిప్సీ వాహనాన్ని వెంబడించామని, కానీ అప్పటికే సల్మాన్‌ ఖాన్‌ పారియాడని, అప్పటికే అక్కడ కృష్ణ జింక మృతదేహం ఉందని వారు చెప్పారు.
7. ఈ కేసు  న్యాయస్థానంలో సుమారు రెండు దశాబ్దాల పాటు నడిచింది. ఆ సమయంలో తన వద్ద ఎలాంటి తుపాకులు లేవని పలుమార్లు ఆయన వాదించారు. తన వద్ద ఒక ఎయిర్‌ గన్‌ మాత్రమే ఉందని, అదీ కూడా చంపే అంత ప్రమాదకరం కాదని గతంలో వాదించారు. అలాగే కుక్కలు దాడి చేయడం వల్ల జింకలు చనిపోయి ఉండవచ్చునని లేదా అతిగా తినడం వల్ల కూడా చనిపోయే అవకాశం ఉండవచ్చనని సల్మాన్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
8. 2009లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కృష్ణ జింకలను రక్షించానని, వాటికి అన్నం పెట్టానని సల్మాన్‌ చెప్పాడు. వివాదం అంతా అప్పటి నుంచే మొదలైందని సల్మాన్‌ ఆరోపించారు.
9. ఇండియాలోని పెద్ద సినిమా స్టార్లలో సల్మాన్‌ ఖాన్‌ ఒకరు. ప్రస్తుతం ఆయనపై 700 కోట్ల రూపాయల మేర సినిమా బిజినెస్‌ జరుగుతోంది.  ఆయన నటిస్తున్న పెద్ద చిత్రాల్లో ఒక్క ‘రేస్‌3’  సినిమా మాత్రమే పూర్తైంది. మిగతా సినిమాలన్నీ డోలాయమానంలో ఉన్నాయి.
10.  ముంబాయిలోని బాంద్రా సమీపంలో పుట్‌పాత్‌ నిద్రిస్తున్న వారి పైకి సల్మాన్‌ ఖాన్‌ కారు దూసుకెళ్లడంతో ఒకరు చనిపోయారు. పలువురు అవిటివారయ్యారు. ఆ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ మద్యం సేవించి ఉన్నారు. కారు నడిపింది సల్మాన్‌ ఖాన్‌నేని ఆధారాలు లభించకపోవడంతో ఆయనకు ఉపశమనం లభించింది. ఈ కేసును కొట్టివేస్తూ 2015 న్యాయస్థానం తీర్పివ్వడంతో సల్మాన్‌ బయటపడ్డారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌