amp pages | Sakshi

అర్ధరాత్రి కేజీబీవీలోకి ప్రవేశించిన అగంతకుడు

Published on Mon, 02/04/2019 - 07:48

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల విద్యార్థినులకు భద్రత కరువవుతోంది. తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు వారిని ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం...అమ్మాయిల పాలిట శాపంగా మారుతోంది. రెండు రోజుల కిందట యాడికి కేజీబీవీలో జరిగిన ఘటన అక్కడి ఉద్యోగులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు డు ఏకంగా ప్రహరీలోకి ప్రవేశించి భవనంపైకి ఎక్కాడు. అదృవశాత్తూ స్టడీలో ఉన్న విద్యార్థినులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇవ్వడం, వారు 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమయానికి వచ్చిన పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు.  
బత్తలపల్లి కేజీబీవీలో గతేడాది అర్ధరాత్రి ఓ అగంతకుడు చొరబడి ఓ విద్యార్థిని గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. కేకలు పెట్టడంతో పారిపోయాడని బాధిత విద్యార్థిని వాపోయింది.

అనంతపురం ఎడ్యుకేషన్‌: అనాథలు, మధ్యలో బడిమానేసిన ఆడ పిల్లల కోసం కేజీబీవీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 62 కేజీబీవీల్లో 12,150 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ విద్యాలయాలన్నీ శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. చాలా చోట్ల ›ప్రహరీలు లేవు. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది అలసత్వం విద్యార్థినుల పాలిట శాపంగా మారుతోంది. శింగనమల నియోజకవర్గంలోని ఓ కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవించింది.

ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తాడిపత్రి ప్రాంతంలోని ఓ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులను అర్ధరాత్రి 11 గంటల సమయంలో కొందరు యువకులు బయటకు తీసుకెళ్లి తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరిగి వదిలి వెళ్లారు. లోపలికి వచ్చే సమయంలో గోడ దూకుతున్న విద్యార్థినులను గుర్తించిన సిబ్బంది మరుసటిరోజు బంధువులను పిలిపించి ఇంటికి పంపించేశారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఓ విద్యార్థిని పట్ల కానిస్టేబుల్‌ లైంగిక వేధింపులకు గురి చేశాడు. గార్లదిన్నె కేజీబీవీలో ఓ విద్యార్థిని గోడదూకి ఆత్మహత్యాయత్నం చేసింది. మరో కేజీబీవీలో విద్యార్థిని చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ ఈ అమ్మాయి ఆచూకీ రెండు రోజుల తర్వాత లభించడంతో బంధువులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సహకారంతో రాప్తాడు నియోజకవర్గంలోని ఓ కేజీబీవీలోకి తరచూ పురుషులు వస్తున్నారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే బాధ్యులెవరని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.  

పని చేయని సీసీ కెమెరాలు  
తరచూ చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో కేజీబీవీల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో 231 సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేజీబీవీలో 2 నుంచి 5 దాకా కెమరాలు అమర్చారు. అయితే ఇవి చాలా చోట్ల పని చేయడం లేదు. అవి పని చేయకపోవడమే బాగుంటుందనే ధోరణిలో సిబ్బంది ఉన్నారు. రిపేరీ సాకుతో వీటిని మూలనపడేశారు. ఏదో ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప ముందుగా చర్యలు తీసుకోవడం లేదు.   

చర్యలు తీసుకుంటున్నాం  
కేజీబీవీల్లో విద్యార్థినుల భద్రతపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమరాలు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. డే, నైట్‌ వాచ్‌ ఉమెన్లు ఉన్నారు. వారితో పాటు సిబ్బంది కూడా నైట్‌ డ్యూటీలో ఉంటారు. కేజీబీవీల వద్ద రాత్రిపూట ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయాలి. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంతో ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా సంబంధిత ఎస్‌ఓ, సిబ్బందిపై చర్యలుంటాయి.   – ఉషారాణి, జీసీడీఓ

#

Tags

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)