amp pages | Sakshi

అత్తింటి ముందు బిడ్డతో కోడలు ఆందోళన

Published on Sat, 04/06/2019 - 13:14

మదనపల్లె : ప్రేమించి పెళ్లి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు. అయితే అతని తల్లిదండ్రులు దళితురాలనే నెపంతో కోడల్ని ఇంట అడుగు పెట్టనీయలేదు. దీంతో అతడు ఆమెను వదిలించుకునేందుకు వేధింపులకు పూనుకున్నాడు. గుట్టుగా రెండో పెళ్లి ప్రయత్నాల్లో పడ్డాడు. ఇది తెలుసుకున్న అతడి భార్య బిడ్డతో సహా వచ్చి తనకు అన్యాయం చేయవద్దని అత్తమామల్ని, భర్తను ప్రాధేయపడింది. అయితే వారు ఆమెను తూలనాడుతూ గెంటేయడంతో న్యాయం కోసం ఆమె రోడ్డెక్కింది. తన బిడ్డతో సహా అత్తగారింటి ముందు ఆందోళన చేసింది. శుక్రవారం ఈ సంఘటన మండలంలోని రెడ్డిగారిపల్లెలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం..కొత్తిండ్లు రంగారెడ్డి కాలనీకి చెందిన దీపాకుమారి స్థానికంగా ఒక నర్సింగ్‌ హోమ్‌లో డయాలసిస్‌ టెక్నీషియన్‌గా పనిచేసేది. రెడ్డిగానిపల్లెకు చెందిన శేషాద్రి బాబాయి ఆస్పత్రిలో పనిచేస్తుండేవాడు. దీపాకుమారితో అతడి పరిచయం ప్రేమగా మారింది.

వేర్వేరు కులాలకు చెందిన వారు పెద్దలకు తెలియకుండా తవళం నేలమల్లేశ్వరస్వామి ఆలయంలో 2016 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. బసినికొండలో కాపురం పెట్టారు. మూడు నెలలు సజావుగా వారు కాపురం సాగింది. తర్వాత శేషాద్రి తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఎస్సీ అనే నెపంతో వారు దీపాకుమారిని కోడలిగా అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమెను వదిలించుకునేందుకు శేషాద్రి విడాకులివ్వాలని వేధించేవాడు. అప్పటికే గర్భంతో ఉన్న ఆమె తన భర్త వేధింపుల విషయమై టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. పోలీసులు శేషాద్రి, కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  అయిననూ వారి తీరు మారలేదు.

గొడవలు..మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే దీపాకుమారి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యవధిలో కేరళలో ట్రైనింగ్‌ పేరిట వెళ్లిన భర్త ఎంతకూ రాకపోవడం, తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు అత్తమామలు యత్నిస్తున్నారని, భర్త గ్రామంలోనే ఉంటున్నాడని తెలియడంతో ఏడాదిన్నర వయసున్న బిడ్డతో రెడ్డిగానిపల్లెలోని అత్తగారింటికి వెళ్లింది. అయితే ఆమెను తూలనాడి, బయటకు గెంటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. బిడ్డతో సహా అత్తారింటి ముందు బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళన చేసింది.  పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. విచారణ చేస్తామని తెలిపారు.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)