amp pages | Sakshi

చెకప్‌ కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..

Published on Sat, 06/06/2020 - 16:52

ముజఫర్‌నగర్‌ : వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన ఓ మహిళపై ఇద్దరు వైద్యులు లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ శుక్రవారం అనారోగ్యానికి గురికావడంతో, వైద్య పరీక్షల నిమిత్తం తల్లి, సోదరుడితో కలిసి నగరంలోని ఓ క్లీనిక్‌కు వెళ్లారు. మహిళపై కన్నేసిన ఇద్దరు యువ డాక్టర్లు.. వైద్య పరీక్షల కోసం గదిలోకి రావాలని చెప్పి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు.
(చదవండి : భర్త వదిలేస్తాడని: గర్భిణి కడుపు కోసి..)

ఈ సమయంలో ఆమె తల్లి, సోదరుడు గది బయటే ఉన్నారు. డాక్టర్ల ప్రవర్తన పట్ల విసుగు చెందిన మహిళ.. పరీక్షలు వద్దని చెప్పి ఇంటికి వెళ్లారు. అనంతరం డాక్టర్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు.. శనివారం క్లినిక్‌ వద్దకు వెళ్లి వైద్యులపై దాడి చేశారు.అనంతరం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అశోక్‌, అనిల్‌ అనే ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితులు పరారిలో ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్ట్‌ చేస్తామని పేర్కొన్నారు.

Videos

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌